తెలంగాణ

గౌడ కులస్తుల ఆత్మగౌరవం పెంపొందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో గౌడ కులస్తుల ఆత్మగౌరవం పెంపొందిస్తామని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి వి. శ్రీనివాసగౌడ్ తెలిపారు. హైదరాబాద్ (బర్కత్‌పుర) లో మంగళవారం ఏర్పాటు చేసిన ‘అలయ్..బలయ్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తులు ఐకమత్యంగా ఉండాలని కోరారు. తల్లివంటి గౌడ కుల వృత్తిని కల్లుగీత కార్మికులంతామరువకుండా కొనసాగించాలని సూచించారు. గీత కార్మికులకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, ఎలాంటి సమస్యలు ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం 3.70 కోట్ల తాటి మొక్కలను రాష్ట్ర వ్యాప్తంగా నాటించేందుకు అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో చర్చిస్తానని చెప్పారు. ‘నీరా’ ప్రాజెక్టుకు సంబంధించిన జీఓను త్వరలోనే తీసుకువస్తామన్నారు. మంత్రి శ్రీనివాసగౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్‌ల సహకారంతో ‘నీరా ప్రాజెక్టు’ త్వరలోనే వస్తుందని రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్ జి. రాజేశంగౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నీరా ప్రాజెక్టు రావడం ఆనందదాయకమని, ఇది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. గౌడ కులస్తుల వృత్తిపరమైన అభివృద్ధి కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటుచేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బిక్షమయ్యగౌడ్, సత్యనారాయణ గౌడ్, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ భాస్కర్‌గౌడ్, టీసీసీ కార్యదర్శి మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.