తెలంగాణ

పేద ఆడపడుచుల పెళ్లిళ్లకు అప్పులు చేయకూడదనే కల్యాణలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, అక్టోబర్ 20: రాష్ట్రంలోని పేద ప్రజల కూతుళ్ల పెళ్లిళ్ల కోసం అప్పులు చేయకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకాల కింద ఆర్థిక సహాయం అందజేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో వనపర్తి మండల పరిధిలోని 40 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ పథకం కింద వనపర్తి మండలానికి మొత్తం 562 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 218 మంది లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయడం జరిగిందని, మరో 170 మందికి ట్రెజరీలో బిల్లులు సమర్పించడం జరిగిందని, 19 దరఖాస్తులు మంజూరికి ఉన్నాయని, మరో 19 వివిధ కారణాల వల్ల తిరస్కరించగా 35 దరఖాస్తులు తహశీల్దార్ స్థాయిలో పరిశీలన పూర్తి అయ్యాయని, మరో 92 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉందని మంత్రి వివరించారు. ఆదివారం పంపిణీ చేసిన చెక్కులో 27 మంది ఎస్సీ లబ్ధిదారులు, 1 ఎస్టీ, 12 మంది మైనార్టీలు ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్‌రెడ్డి, ఆర్డీఓ చంద్రారెడ్డి, తహశీల్ధార్ రాజేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.