తెలంగాణ

23న ఓయూలో ఆర్టీసీ జేఏసీ బహిరంగ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: ఆర్టీసీ సమ్మెను బలోపేతం చేయడానికి ఈనెల 23న హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటిలో నిర్వహించనున్న జేఏసీ బహిరంగ సభకు అనుమతులు రాకపోచ్చునని పోలీసు వర్గాలు తెలిపాయి. ఓయూ జేఏసీ విద్యార్థల మద్దతుతో సమ్మెను ఉధృతం చేయడానికి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో 23న ఓయూలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని జేఏసీ కన్వీనర్ శనివారం ప్రకటించిన విషయం తెల్సిందే. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీల చర్చలు, బహిరంగ సభలు నిర్వహించరాదని గతంలో వీసీగా పని చేసిన వ్యక్తులు నిరాకరించారు. వర్సిటీల్లో కేవలం విద్యార్థలకు సంబంధించిన సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చునని వీసీలు ఆదేశించారు. ఆర్టీసీ సమ్మె నేతృత్వంలో విద్యార్థులను భాగస్వామ్యులను చేయడానికి ఆర్టీసీ జేఏసీ ఓయూలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడానకి అవకాశం ఉండదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఓయూలో బహిరంగ సభ కోసం ఆర్టీసీ జేఏసీ కూడా అనుమతి కోసం ఎలాంటి దరఖాస్తు చేయలేదని హైదరాబాద్ కమిషనరేట్ వర్గాలు దృవీకరించలేదు. దీంతో భారీ బహిరంగ సభ ఉంటుందా ఉండదా అన్న సమాచారం ఈనెల 22న ప్రకటన వెలువడచ్చు.