తెలంగాణ

ఖరీఫ్‌లో ధాన్యం సేకరణకు ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో 2019 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకోసం ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను రూపొందించింది. ఈ సీజన్‌లో 55 లక్షల టన్నుల వరిధాన్యం మార్కెట్‌కు వస్తుందని తొలుత అంచనావేయగా, తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం 75 లక్షల టన్నుల వరిధాన్యం వస్తుందని భావిస్తున్నారు. రైతుల నుండి ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వరిధాన్యం మార్కెట్లకు వస్తోంది. ప్రస్తుతం హంస తదితర స్వల్పకాలిక రకాల ధాన్యం వస్తుందని భావిస్తుండగా, వచ్చే నెలలో మసూరి, సోనామసూరి తదితర దీర్ఘకాలిక రకాలు వస్తాయని భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరలపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు 1,835 రూపాయలుగా, ‘బీ’ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు 1,815 రూపాయలుగా కేంద్రం నిర్ణయించింది. ఈ పర్యాయం ఎక్కువ మొత్తంలో వరిధాన్యం మార్కెట్లోకి వస్తుండటంతో వ్యాపారులు రైతులను మోసం చేయకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరిగితే వెంటనే ఆ కేంద్రాన్ని రద్దు చేయాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వ్యవసాయం, మార్కెటింగ్, గిడ్డంగులు, తదితర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం సూచించింది. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), ధాన్యం నాణ్యత విషయంలో ప్రభుత్వం రూపొందించిన నియమావళిని అందరూ అమలు చేసేలా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బు చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.