తెలంగాణ

సమ్మె పోరు ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: న్యాయమైన తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె పోరు ఆగబోదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ, రాజకీయ పక్షాల నేతృత్వంలో ఈనెల 30న హైదరాబాద్‌లో ఐదు లక్షల మందితో సకల జనుల భేటీకి సన్నాహాలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని ఆయన
ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ వైఖరి, అణచివేత ధోరణి, దమనకాండలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. గత 16 రోజులుగా తాము కొనసాగిస్తున్న ఆర్టీసీ సమ్మె పోరు ఆగదని, దీనిని మరింత బలోపేతం చేయడానికి ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకూ జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్షాల నేతలతో ఆర్టీసీ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. భేటీలో జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై వారు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం చర్చల అంశాలను జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మీడియాకు వివరించారు. ఈనెల 21న రాష్ట్రంలోని 97 ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల కుటుంబాలతో బైఠాయింపు కార్యక్రమం ఉంటుందన్నారు. 22న తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లుతో కలసి జేఏసీకి మద్దతుగా సంఘీభావం తెలపాలని కోరతామన్నారు. 23న తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యే, ఎంపీల మద్దతును ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. 24న మహిళా కండక్టర్లు డిపోల వద్ద దీక్షలు చేస్తారన్నారు. 25న ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ మనసు మారాలని కార్మికుల పిల్లలతో దీక్షలు చేయిస్తామన్నారు. 26న దీపావళి పండుగకు జీతాలు లేకపోవడాన్ని నిరసిస్తూ ధర్నాలు చేస్తామన్నారు. 27న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో జరిగిన వాదనలను ప్రజలకు వివరిస్తామన్నారు. 28న రాజకీయ పక్షాల మద్దతుతో డిపోల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. 29న అభుత్వ, ప్రభుత్వేతర సిబ్బందితో ర్యాలీలు చేపడతామన్నారు. 30న హైదరాబాద్‌లో ఐదు లక్షల మందితో సకల జనుల భేటీ నిర్వహిస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో 16వ రోజు కూడా సమ్మె యథావిధిగా కొనసాగిందన్నారు. సమ్మెను ఉధృతం చేయడానికి జేఏసీ వినూత్న కార్యక్రమాలను చేపట్టిందన్నారు. డిపోల వద్ద జేఏసీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారన్నారు. పట్టణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద సమ్మెకు మద్దతు పలికిన ప్రజలకు గులాబీ పువ్వులను కార్మికులు అందజేశారన్నారు. శనివారం జరిగిన రాష్ట్ర వ్యాప్త బంద్ వంద శాతం సక్సెస్ అయ్యిందన్నారు. ఈ బంద్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర సరిహద్దుల నుంచి పొరుగు రాష్ట్రాలకు వచ్చీపోయే ప్రయాణికులకు గులాబీ పువ్వులతో స్వాగతించామన్నారు. సీపీఐ ఎంఎల్ నేత పోటు రంగారావుపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయడాన్ని జేఏసీ తీవ్రంగా ఖండించిందన్నారు. అందుకు బాధ్యలైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్లకార్డులతో కార్మికులు నిరసనలను చేపట్టారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై ఆందోళన చెందిన మరో ఇద్దరు కార్మికులు బలవన్మరణం చెందారన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన గోసుకొండ మల్లయ్య, ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఎస్‌కే ఖాజా మియా మనస్తాపంతో సెప్టెంబర్ నెల జీతం రాలేదని బెంగతో గుండెపోటుతో మరణించినట్లు అశ్వత్థామరెడ్డి తెలిపారు. తోటి ఆర్టీసీ కార్మికుల కోసం బలవన్మరణాలకు పాల్పడడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు జేఏసీ తరఫున ఆయన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

*చిత్రం...ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి