తెలంగాణ

విద్యుత్ కార్మికులతో చర్చలు సఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,, అక్టోబర్ 19: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక సంఘాల నేతలతో విద్యుత్ అధికారులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు పోతామని కార్మిక సంఘాలు సూచించడంతో విద్యుత్ అధికారులు అప్రమత్తం అయ్యారు. శనివారం విద్యుత్ సౌధాలో విద్యుత్ సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల మధ్య సానుకూలమైన చర్చలు జరిగాయి, విద్యుత్ ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటి దశలవారిగా పరిష్కరిస్తామని సీఎండీ హామీ ఇవ్వడంతో కార్మిక సంఘాలు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశాయి.
ప్రధానంగా ఆర్టిజన్ల సమస్యలపై చర్చరించారు. ఆర్టిజన్లకు ప్రత్యేక సర్వీస్ రూల్స్‌ను అమలు చేయడానికి అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు. ఉద్యోగు, కార్మికుల జీపీఎఫ్‌కు సంబంధించన విషయాలను పరిష్కరిస్తామన్నారు. కార్మిక సంఘాలు, అధికారుల మధ్య జరిగిన ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశారు. చర్చల్లో విద్యుత్ సంస్థల సీఎండీలు రఘుమారెడ్డి, గోపాలరావు, జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్ల అశోక్‌కుమార్, వెంకటేశ్వరావు, పర్వతం, విజయకుమార్, కార్మిక సంఘాల తరుపున పద్మారెడ్డి, శ్రీ్ధర్, సాయిబాబ, ఎంఎ నజీర్, ప్రభాకర్, అబ్దుల్ మజీద్, సాయిలు పాల్గొన్నారు.
*చిత్రం...విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మిక సంఘాల నేతలతో అధికారులు
సానుకూలంగా చర్చల అనంతరం సంతోషం వ్యక్తం చేస్తున్న ఇరు వర్గాలు