తెలంగాణ

నేడు పేట జిల్లాలోకి ఎస్సారెస్పీ రెండోదశ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, అక్టోబర్ 19: కాస్త ఆలస్యమైనప్పటికీ అంతా అనుకున్నట్టే శ్రీరాంసాగర్ రెం దశ జలాలు కాలువల ద్వారా నిర్ణీత గమ్యం వైపు పయనించడానికి వడివడిగా పరుకులు పెడుతున్నాయి. ఇప్పటికే కాలువల ద్వారా నీటిసామర్ద్యం పెంపుతో ఉమ్మడి వరంగల్ జిల్లా మైలారం రిజర్వాయరును నింపుకొన్న జలాలు తాజాగా అదే జిల్లా కొడకండ్ల మండలంలోని బయ్యన్నవాగు రిజర్వాయరులోకి అడుగుపెట్టాయి. అయితే రిజర్వాయరులో ఆశించినంత నీరు చేరుతుండటంతో గేట్లు తెరిచి పక్కనే ఉన్న సూర్యాపేట జిల్లాకు ఆ నీటిని వదలాలని ఆశాఖ అధికారులు తాజాగా నిర్ణయించారు. ఈమేరకు ఈనెల 20న జిల్లా వైపు ఆ నీటిని విడిచిపెడుతున్నట్లు ఆశాఖ ఈఈ నారాయణ శనివారం ఆంధ్రభూమికి తెలిపారు. అయితే నీటి విడుదలని మద్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో చేయనున్నట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా గేట్ల ద్వారా నీటి విడుదలయ్యాక దాదాపు నాలుగైదు గంటల్లో వెలిశాల వద్ద సూర్యాపేట జిల్లాలోకి ప్రవేశించనున్నాయని ఆయన పేర్కొన్నారు. తొలుత 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి క్రమక్రమంగా నీటి సామర్ధ్యాన్ని వేయి నుండి 1600 క్యూసెక్కులకు పెంచి విడుదల చేస్తామని ఆయన వివరించారు. ముఖ్యంగా కరవుప్రాంతమైన తుంగతుర్తికి ఎస్పారెస్పీ రెండోదశ నీటి విడుదలపై స్దానిక శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్ పలుమార్లు జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉన్నతాధికారులతోగతంలో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.