తెలంగాణ

బంద్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: గత 15 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను నివారించడానికి ఎలాంటి చర్యలూ చేపట్టకపోగా, దానిని శాంతిభద్రతల సమస్యగా చూస్తూ నేడు యావత్ తెలంగాణ సమాజం శాంతియుతంగా తెలంగాణ బంద్ పాటిస్తుంటే అక్రమ అరెస్టుల ద్వారా తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించడాన్ని టీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఫెడరేషన్ అధ్యక్షుడు ఇ రఘునందన్, ప్రధానకార్యదర్శి కే రమణ పేర్కొన్నారు. తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరిగిందని, విజయవంతం అయ్యిందని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా జరిగిన బంద్‌లో పెద్ద ఎత్తున టీచర్లు పాల్గొని తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారని చెప్పారు. రాష్టవ్య్రాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు శాంతియుతంగా ర్యాలీలు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. రాష్టవ్య్రాప్తంగా పోలీసులు అరెస్టు చేసిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. అరెస్టుల ద్వారా ఏమీ సాధించలేరని, హైకోర్టు సూచించిన విధంగా వెంటనే చర్చల ప్రక్రియను ప్రారంభించాలని టీటీఎఫ్ పక్షాన డిమాండ్ చేశారని, తద్వారా కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై కూడా వెంటనే స్పందించి ఆయా సంఘాలతో చర్చలు జరిపి పరిష్కరించాలని కోరారు. పాఠశాలల సెలవులు పొడిగించడం ద్వారా విద్యార్థులు ఇప్పటికే నష్టపోయారని ఇక ఎంత మాత్రం సెలవులు పాటించకుండా 21వ తేదీ నుండి పాఠశాలలను పున:ప్రారంభించాలని కోరారు.