తెలంగాణ

22న హైదరాబాద్‌లో కేంద్ర జలసంఘం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక మూడు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించడం కోసం ఈ నెల 22న హైదరాబాద్‌లో కేంద్ర జల సంఘం సమావేశం కాబోతుంది. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు చెందిన నీటిపారుదలశాఖ అధికారులు హాజరుకానున్నారు. తెలంగాణ సరిహద్దులోని రాజోలి బండా డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలపడంతో కర్నాటక ప్రభుత్వం నిలిపివేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో జరిగిన తుంగభద్ర నదీ జలాల యాజమాన్య బోర్డు సమావేశంలో ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. దీంతో మూడు రాష్ట్రాల ప్రతినిధుల సమక్షంలో ఆర్డీఎస్ వివాదంపై చర్చించడానికి ఈ నెల 22న హైదరాబాద్‌కు రావాల్సిందిగా తుంగభద్ర బోర్డు అధికారులు మూడు రాష్ట్రాలకు వర్తమానం పంపించారు.