తెలంగాణ

చర్చల ప్రస్తావనే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ నేతలతో శనివారం జరగాల్సిన ప్రభుత్వం చర్చలు జరగలేదు. కార్మిక నేతలు చర్చలకు వస్తారని తాను కార్యాలయంలో ఉదయం నుంచి ఎదురు చూస్తున్నానని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ స్పష్టం చేశారు. చర్చలు జరపాలని కోర్టు నుంచి ఇప్పటివరకూ తమకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ఇరుపక్షాల మధ్య చర్చలు ఉంటాయని హైకోర్టు సూచించినట్లు మీడియా కథనాల్లో చూశానన్నారు. ఆర్టీసీ సమ్మె ప్రభావంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా బస్సులను పూర్తిస్థాయిలో తిప్పడానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో ఉన్న 97 బస్ డిపోల్లో ఉన్న బస్సులు బయటికి తీసుకురావడానికి పోలీస్ సహకారం తీసుకోవాలన్నారు. బస్సులు నడపడానికి అవసరమైన కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికల్ కార్మికులను వెంటనే
భర్తీ చేయాలని ఆదేశించారు. సిబ్బంది భర్తీలో జాప్యం చేయవద్దని అధికారులను ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన గుర్తు చేశారు.

*చిత్రం... ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ