తెలంగాణ

నేడు డిపోల వద్ద నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం బంద్ ముగించుకున్న తర్వాత జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల మద్దతుతో బంద్ సక్సెస్ కావడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు. సకల జనులు బంద్‌లో పాల్గొనడం పట్ల వారు స్వాగతించారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా దాటవేత ధోరణికి ప్రయత్నిస్తోందన్నారు. సాక్షాత్తూ హైకోర్టు జోక్యం చేసుకుని
ప్రభుత్వం చర్చలు జరపాలని సూచించినా అందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం దుర్మార్గం అని వారు అన్నారు. ప్రభుత్వ వైఖరి పట్ల తెలంగాణ సమాజం గర్హిస్తోందన్నారు. ప్రభుత్వంపై ఆర్టీసీ జేఏసీ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వంపై వత్తిడి పెంచడానికి ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ బస్ డిపోల వద్ద నిరసనలు, ధర్నాలు చేపట్టాలని జేఏసీ నిర్ణయించిందన్నారు. ఆదివారం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. అలాగే 23న ఉస్మానియా వర్సిటీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. బంద్ సందర్భంగా ఆర్టీసీ జేఏసీకి మద్దతు చెప్పడానికి వచ్చిన సీపీఎం ఎంఎల్ నేత పోటు రంగరావు చేతి వేలు విరిగిందని తెలుసుకున్న జేఏసీ నేతలు ఆయనను పరామర్శించారు.