తెలంగాణ

స్పందించకుంటే సకల జనుల సమ్మెగా మారడం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 18: ఆర్టీసీ సమ్మెపై ఇప్పటికైనా సీఎం కేసీఆర్ తన వైఖరిని మార్చుకొని స్పందించకుంటే సమ్మె ఉధృతమై సకల జనుల సమ్మెగా రూపాంతరం చెందుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా 14వ రోజు సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపో ముందు జరుగుతున్న ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం ఫ్రభుత్వం స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతంగా కొనసాగుతోందని నూటికి నూరు శాతం ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొంటున్నారని అన్నారు. ఆర్టీసీ సమ్మెకు సీపీఎం సంపూర్ణ మద్దతునిస్తూ ఆందోళనలో ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్పారు. శనివారం నిర్వహించే రాష్ట్ర బంద్‌లో అన్ని పక్షాలతో కలిసి వామపక్షాలు సైతం పాల్గొంటాయని అన్నారు. సమ్మెకు దిగిన కార్మికులకు అండగా నిలిచేందుకు వామపక్షాల ఆధ్వర్యంలో త్వరలో రాష్టవ్య్రాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. సమ్మె ఉధృతంగా కొనసాగుతూ 50 వేల కుటుంబాలు రోడ్డున పడ్డా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సీఎం కేసీఆర్ మొండివైఖరిని వీడకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. సమ్మె జరుగకుండా కార్మికులతో సీఎం చర్చించి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉండగా అందుకు భిన్నంగా నిరంకుశంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. 50 శాతం ప్రైవేటీకరణతో కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదముందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం ప్రజారవాణా వ్యవస్థలు ప్రభుత్వాల ఆధీనంలోనే నడుస్తున్నాయని అన్నారు. ఆర్టీసీ నష్టపోతే కార్మికులతో పాటు సమాజమంతా నష్టపోతుందన్నారు. అందువల్ల ఈ సమ్మెకు అన్నివర్గాల ప్రజలు మద్దతునిచ్చి ముందుకు సాగాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంతవరకు వామపక్షాలు అండగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయకార్యదర్శి పోటు రామయ్య, సీపీఎం నాయకులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, న్యూడెమోక్రసీ జిల్లాకార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, సీపీఐ నాయకులు దోరెపల్లి శంకర్, అరుణోదయ కార్యదర్శి రాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.