తెలంగాణ

నేడు ఆకాశవాణి సంగీత సమ్మేళనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘2019-ఆకాశవాణి సంగీత సమ్మేళనం’ నిర్వహిస్తున్నట్టు ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ ఎం శైలజా సుమన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 24 ఆకాశవాణి కేంద్రాలలో నిర్వహించనున్న సంగీత సమ్మేళనంలో 177 మంది సంగీత విద్వాంసులు పాల్గొంటారని తెలిపారు. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే సంగీత సమ్మేళనంలో ప్రముఖ కర్నాటక, హిందుస్తానీ సంగీత విద్వాంసులు పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే విద్వాన్ అల్లం దుర్గా ప్రసాద్ గోటు వాద్య కచేరి, హెచ్‌కె వెంకటరామ్ వయోలిన్, విద్యాన్ కమలాకర్‌రావు మృదంగం, ఘటం కళాకారులు వాళప్పళి, ఆర్ కృష్ణకుమార్‌ల కచేరి ఉంటుందన్నారు. హిందస్తానీ శాస్ర్తియ సంగీతంలో ఉస్తాద్ అహ్మద్ ఖాన్ గాత్ర కచేరి ఉంటుందని పేర్కొన్నారు.