తెలంగాణ

స్టోరేజీ సమస్యను అధిగమిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా బియ్యం నిల్వలకు అవసరమైన గోదాములను కేటాయించాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ విజ్ఞప్తి చేశారు. స్టోరేజీ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై ఎఫ్‌సీఐ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏటేటా ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయని, ఈ ఏడాది పౌరసరఫరాల సంస్థ ఖరీఫ్‌లో 55 లక్షల మెట్రిక్ టన్నులు, రబీలో 37 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం 92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకు అవసరమైన స్టోరేజీ స్పేస్‌ను సమకూర్చాలని కమిషనర్ కోరారు. ఎఫ్‌సీఐ నుండి రావాల్సిన బకాయిలు సీఎంఆర్ రూ.888 కోట్లు, ఆర్‌డీ సెస్ రూ.95 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆయన చేసిన విజ్ఞప్తిపై అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఎఫ్‌సీఐ జనరల్ మేనేజర్ అశ్వినీ కుమార్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.