తెలంగాణ

పువ్వాడకు గవర్నర్ ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: గత 13 రోజులుగా ఆర్టీసీ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం తీసుకున్న చర్యల వివరాలు ఏమిటో చెప్పాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు గవర్నర్ తమిళసై ఫోన్ చేశారు. సమ్మెపై శనివారం ఒక నిర్ణయానికి వచ్చి, విధాయక నివేదికతో రావాలని హైకోర్టు ఆదేశించడంతో మల్లగుల్లాలు పడుతున్న సర్కారుకు గవర్నర్ ఫోన్ మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ వరుస పరిణామాలు ప్రభుత్వాధికారులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇప్పటికే సమ్మెకు అనుకూలంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గవర్నర్‌కు ఫిర్యాదులు చేశారు. సమ్మెను విరమింపచేయడానికి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరాయి. దీంతో గవర్నర్ ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఆమె ఫోన్ చేసి, సమ్మె ప్రభావంపై ఆరా తీశారు. ప్రజారవాణాకు జరుగుతున్న అసౌకర్యంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని అడిగారు. విద్యార్థలకు సెలవులు పెంచడంతోవారి చదువులు దెబ్బతింటాయి కదా అంటూ మంత్రిపై గవర్నర్ ప్రశ్నల వర్షం కురిపించినట్టు విశ్వసనీయ సమాచారం. సమ్మె విషయంపై ఎప్పటికపువ్పడు సీఎం కేసీఆర్ సమాచారం అందిస్తున్నామని గవర్నర్‌కు మంత్రి పువ్వాడ సమాధానం ఇచ్చారు. అయితే ‘మంత్రిగా మీరు సమస్య పరిష్కారానికి సూచనలు చేసే అవకాశాలు ఏవీ లేవా’ అంటూ మరిన్ని ప్రశ్నలను గవర్నర్ సంధించడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ఎందుకు పోవాల్సి వచ్చింది? ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సూచించిన అంశాల ఏమిటి? అని మంత్రిని గవర్నర్ ప్రశ్నించారు. వాటికి సంబంధించిన నివేదికను పంపాలని ఆదేశించారు. గవర్నర్ సూచనలతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సీనియర్ ఐఎఎస్ అధికారి సునీల్‌శర్మను గవర్నర్ దగ్గరికి హుటాహుటిన పంపించారు. రాష్టంలో 9వేల బస్‌లు తిరుగుతున్నాయని ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ గవర్నర్‌కు వివరాలు అందచేసినట్టు గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన నోట్ తెలిపారు.