తెలంగాణ

లక్కీ.. కిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు వ్యపారవేత్తలు పెద్ద ఎత్తును పోటీపడ్డారు. మద్యం షాపులను దక్కించుకునేందుకు దరఖాస్తుదారుడు నాన్ రీఫండబుల్ ఫీజు రూపంలో రూ.2 లక్షలు చెల్లించి టెండర్లలో పాల్గొనాల్సి ఉంది. గతం కంటే ఈసారి లక్ష రూపాయలు పెరిగిన దరఖాస్తుదారులు ఏమాత్రం వెనకడుగు వేయకుండా మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు పోటీపడ్డారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో ఆదాయం చేకురింది. రాష్ట్రంలో మద్యం దుఖాణాల కోసం భారీ స్థాయి లో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో 2216 మద్యం దుకాణాలకు గాను దాదాపు 46 వేల దరఖాస్తులు రావడం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ టెండర్లలో విశేషం. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి బుధవారం చివరి రోజు కావడంతో అర్థరాత్రి వరకూ దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.2 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజు వసూలు చేయడంతో గతంలో వచ్చిన ఆదాయంకంటే ఈసారి రెట్టింపయ్యింది. దాదాపు ప్రభుత్వ ఖజానాకు రూ.900కోట్లకు పైగా చేరిన్నట్లు తెలుస్తొంది. 2017 సంవత్సరంలో ప్రభుత్వానికి మద్యం షాపుల లైసెన్స్ దరఖాస్తుల రూపంలో రూ.411 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తు రుసుంను పెంచడంతో దరఖాస్తు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపరని ఆధికారులు భావించిన్నప్పటికీ ఊహించని రీతిలో భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు ఆచ్చర్యానికి గురయ్యారు. బుధవారం దరఖాస్తుల గడువుకు చివరి రోజు కావడంతో దాదాపు 24,448 దరఖాస్తులు వచ్చాయి. సూర్యపేట జిల్లాలో 75 మద్యం దుకాణాలకు గాను 2,426 దరఖాస్తులు అందగా, సూర్యపేట జిల్లాలోని జాన్‌పహాడ్‌కు అత్యధికంగా 156 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఈనెల 18వ తేదీన డ్రా తీయనున్నారు. వరంగల్ డివిజన్‌లో- అత్యధిక దరఖాస్తులు రాగా, ఆంధ్రాకు సరిహద్దున ఉన్న ఖమ్మం, నల్గొండ డివిజన్లలో పెద్ద మొత్తంలో దరఖాస్తులు అందాయి. హైదరాబాద్‌లో మాత్రం తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయి. ఇది ఇలా ఉండగా శుక్రవారం లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఈ మద్యం లక్కీ కిక్కు ఎవరిని వరిస్తోందో వేచి చూడాల్సిందే.