తెలంగాణ

సమ్మెను పరిష్కరించండి.. మా డిమాండ్లు తీర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించడమే కాకుండా ఉద్యోగ సంఘాల జేఏసీ గురువారం మరో అడుగు ముందుకేసింది. ఆర్టీసీ సమ్మెను వెంటనే పరిష్కరించడంతో పాటు తమ అపరిష్కృత డిమాండ్లను కూడా తీర్చాలని కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, గజిటెడ్ అధికారుల, కార్మిక, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషిని కలిసి వినతి పత్రం సమర్పించింది.
అనంతరం ఉద్యోగ జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్ వి మమత సీఎస్‌తో సమావేశమైన వివరాలను మీడియాకు వెల్లడించారు. 13 రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల ఇటు కార్మికులు, అటు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె వల్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు తమ మద్దతు కోరడంతో పాటు ప్రభుత్వంతో చర్చలకు మధ్యవర్తిత్వం వహించాలని కోరినట్టు వారు సీఎస్‌కు వివరించారు. ఇప్పటికే తాము వారికి మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసినట్టు తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేసిన డ్యూటీలను ఉప సంహరించుకోవాలని కోరినట్టు వారు వివరించారు. ఆర్టీసీ కార్మికులు ఆధైర్య పడి ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడ వద్దని కారం రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉందని గుర్తు చేశారు. ఈ నెల 19 జరిగే ఆర్టీసీ బంద్‌లో తాము కూడా పాల్గొంటామని చెప్పారు.
ఉద్యోగుల అపరిష్కృత డిమాండ్లపై ఇచ్చిన గడువులోగా పరిష్కారం లభించకపోతే తాము కూడా సమ్మెకు దిగడానికి వెనుకాడేది లేదని హెచ్చరించారు. సెకట్రరీ జనరల్ మమత మాట్లాడుతూ, హుజూర్‌నగర్ ఉప ఎన్నికల కోడ్ ముగిసాక తమ డిమాండ్లు పరిష్కరించనున్నట్టు సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆర్టీసీ సమ్మెను విరమణకు చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. తమ వినతికి సీఎస్ జోషి సానుకూలంగా స్పందించారని మమత తెలిపారు.
*చిత్రం... సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషిని కలిసాక మీడియా సమావేశంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కారం రవీందర్‌రెడ్డి, మమత, మామిళ్ల రాజేందర్, ముజీబ్ తదితరుల బృందం