తెలంగాణ

నెల నెలా జీతాలివ్వండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: నెల నెలా జీతాలు చెల్లించేలా అధికారులను ఆదేశించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావుకు కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్షుడు కనకచంద్రం నేతృత్వంలోని బృందం ఒక వినతిపత్రాన్ని మంత్రికి అందించింది. నెలనెలా వేతనాలు అందకపోవడంతో తాము, తమ కుటుంబ సభ్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన హరీష్‌రావు వచ్చే నెల నండి నెలనెలా వేతనాలు చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.