తెలంగాణ

కేంద్రం నిధులు ఇచ్చినా వెచ్చించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: కేంద్ర ప్రభుత్వం రూసా పథకం కింద రాష్టప్రరిధిలోని ఏడు యూనివర్శిటీలకు, మహిళా డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు, ఎస్సీ,ఎస్టీ బాలికల హాస్టళ్లకు 242 కోట్ల రూపాయిలు కేటాయించింది. అందులో ఉస్మానియా యూనివర్శిటీకి 107 కోట్ల రూపాయిలను కేంద్రం కేటాయించింది. కేంద్రప్రభుత్వం యూనివర్శిటీల్లో వివిధ అంశాలకు 60 శాతం నిధులను కేటాయిస్తే మిగిలిన 40 శాతం నిధులను ఆయా రాష్ట్రాలు వెచ్చించాల్సి ఉంటుంది. యూనివర్శిటీలు ప్రతిపాదించిన ప్రాజెక్టుల వ్యయంలో 40 శాతం నిధులను ముందుగా రాష్ట్రాలు విడుదల చేస్తేనే మిగిలిన 60 శాతం కేంద్రం విడుదల చేస్తుంది. రాష్ట్రాలు నిధులు ఇవ్వకుంటే కేంద్రం కేటాయించిన నిధులను మంజూరు చేయదు. రాష్ట్రంలో జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్శిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, తెలంగాణ యూనివర్శిటీ, మహాత్మాగాంధీ యూనివర్శిటీ, పాలమూరు యూనివర్శిటీతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్శిటీకి, భూపాలపల్లి జిల్లాలో డిగ్రీ కాలేజీలకు కేంద్రం రూసా -2 కింద నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులను మంజూరు చేయకపోవడం వల్ల కేంద్రం మంజూరు చేసిన నిధులు మురుగుపోతున్నాయని రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదులు అందడంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించారు. కేంద్రం మంజూరు చేసిన నిధులు మురుగుపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ఛాన్సలర్ హోదాలో ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేంద్రం ప్రాధమిక పాఠశాలల అభివృద్ధికి సర్వశిక్షా అభియాన్ పథకాన్ని, మాధ్యమిక విద్యాసంస్థల అభివృద్ధికి ఆర్‌ఎంఎస్‌ఏ పథకాన్ని, యూనివర్శిటీల అభివృద్ధికి రూసా పథకాన్ని ప్రారంభించింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ ఆధీనంలోని సెంట్రల్ యూనివర్శిటీలకు నేరుగా యూజీసీ భారీ ఎత్తున నిధులు ఇస్తుండగా, రాష్ట్ర స్థాయి వర్శిటీలకు, ఉన్నత విద్యాసంస్థలకు నిధుల కొరత ఏర్పడింది. దాంతో కేంద్రం రూసా పథకాన్ని ప్రారంభించింది. 2013-14 నుండి 2016-17 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా వివిధ విద్యాసంస్థలకు కేంద్రం 2400 కోట్లు మంజూరు చేయగా, 2017-18 నుండి 2019-20 ఆర్ధిక సంవత్సరానికి 7100 కోట్లు వెచ్చించబోతోంది. ఈ నిధులను సవ్యంగా వెచ్చించే రాష్ట్రాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. 316 యూనివర్శిటీ, 13,024 డిగ్రీ, పీజీ కాలేజీలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి. డిగ్రీ కాలేజీలను యూనివర్శిటీలుగా అభివృద్ధి చేయడం, సమీపంలోని అన్ని డిగ్రీ కాలేజీలను క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఉమ్మడి సదుపాయాలు కల్పించడం, వౌలిక సదుపాయాలు కల్పించడం, కొత్తగా మోడల్ డిగ్రీ కాలేజీలు, పీజీ కాలేజీలను ప్రారంభించడం, పరిశోధనలు, వినూత్న బోధన పద్ధతులను అనుసరించడం, బోధన సిబ్బంది నియామకం, బోధన సిబ్బందికి నూతన బోధన పోకడలపై శిక్షణ, సంస్థాగత నవీకరణకు ఈ రూసా కింద నిధులను వెచ్చిస్తున్నారు. తొలి విడతలో పొందిన నిధులను సంపూర్ణంగా వినియోగించుకున్న తెలంగాణ రెండో విడతలో మాత్రం వెనుకంజ వేసిందని రాజ్‌భవన్‌కు ఫిర్యాదు అందింది.