తెలంగాణ

20న న్యాయ విద్యాకళాశాలల్లో సీట్ల కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: రాష్ట్రంలోని న్యాయ విద్యా కళాశాలల్లో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు నిర్వహించిన సర్ట్ఫికేట్ల పరిశీలన, ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ముగిసింది. శుక్రవారం నాడు అధికారులు వెబ్ ఆప్షన్ల ట్రయిల్ నిర్వహించనున్నారు. శనివారం నాడు వెబ్ ఆప్షన్లను కేటాయించనున్నట్టు తెలిసింది. వారం రోజులు గడువు విధించి అక్టోబర్ చివరి వారంలో రెండో దశ కౌనె్సలింగ్ నిర్వహించనున్నారు.
అనంతరం మిగిలిన సీట్లను ఆయా కాలేజీల్లో భర్తీ చేసేలా స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తారు. లా కాలేజీల్లో తరగతులు ఈ నెలాఖరు నుండి మొదలవుతాయని ఉస్మానియా యూనివర్శిటీ అధికారి ఒకరు చెప్పారు. సార్వత్రిక వౌలిక అభ్యాసనం ప్రాజెక్టు ప్రభుత్వ విధానం, పరిపాలన, అభివృద్ధి ఫలితాలు మెరుగుపర్చడానికి వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా స్టేట్స్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ టీ విజయకుమార్ తెలిపారు.