తెలంగాణ

పత్తి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామి వరంగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 17: సీఎం కేసీఆర్‌ది రైతు ప్రభుత్వం అని, ప్రతి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం వరి, పత్తి కొనుగోళ్లపై వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని, రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. ప్రతి రైతుకు గిట్టు బాటు ధర పొందేలా ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లు పకడ్భందిగా జరగాలని ఆయన అధికారులకు సూచించారు. మార్కెట్ కొనుగోళ్ల నిబంధనలపై రైతులకు అవగాహన కల్పించాలని, పత్తి కొనుగోళ్లపై సీసీఐ ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి తెలిపారు. బస్తాలు, బోరాల్లో తీసుకువచ్చే పత్తిని సీసీఐ కొనుగోలు చేయదనే విషయాన్ని రైతులకు వివరించాలన్నారు. పత్తి ఉత్పత్తిలో దేశంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లా అగ్రస్థానంలో ఉంటుందని, నాణ్యత విషయంలోనూ వరంగల్ పత్తికి ప్రత్యేకత ఉందన్నారు. సీసీఐ నిరంతరం కొనుగోళ్లు చేస్తే వ్యాపారులు కూడా రైతులకు మంచి ధర ఇస్తారని సూచించారు. ఒక రైతు 40 క్వింటాల్ కంటే ఎక్కువ పత్తిని ఒకేసారి తీసుకువస్తే కొనుగోలుకు ఇబ్బంది లేకుండా వ్యవసాయ అధికారులు వెంటనే సర్ట్ఫికేషన్ ఇవ్వాలని అన్నారు. రైతులకు వెంటనే సర్ట్ఫికెట్లు ఇప్పించేలా రైతు సమన్వయ సమితి ముఖ్యులు బాధ్యత తీసుకోవాలన్నారు. కొనుగోళ్లకు సంబంధించి అప్పటికప్పుడు వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించేలా ప్రణాళిక ఉండాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా వ్యాపారులు సహకరించాలని కోరారు. ఐకేపి సంఘాల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని మంత్రి తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులకు ఇబ్బంది కలుగవద్దనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. కొనుగోళ్ల ప్రక్రియలో ఈ సారి వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలు ఆదర్శంగా నిలువాలని ఆయన అన్నారు. రైతులకు అన్ని రకాలుగా అండగా నిలువాలని, ఐకేపీ కేంద్రాలకు సంబంధించి ఒక కేంద్రానికి ఒక అధికారిణి , ఒక మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని అన్నారు. ప్రతి సీసీఐ కేంద్రానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు. రైతు సమన్వయ సమితి బాధ్యులకు విధులను ఖరారు చేసే విషయంపై సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు బాగుండాలనే లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, హరిత, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి ప్రతినిధులు, సీసీఐ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు