తెలంగాణ

బిల్ట్ జాప్యం పట్ల కేటీఆర్ అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: వరంగల్ జిల్లా కమలాపూర్‌లో బల్లార్ పూర్ ఇండస్ట్రీస్ (బిల్ట్) పునరుద్ధరణ గడువులోగా జరగక పోవడం పట్ల పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్ట్ పునరుద్ధరణపై గురువారం సంబంధిత అధికారులు, కంపనీ యాజమాన్య ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. బిల్ట్ పునరుద్ధరణకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ, సహకారాలు, ప్రోత్సహాకాలు ఇచ్చినప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. పునరుద్ధరణపై కచ్చితమైన వ్యవధిని కంపెనీ నుంచి తాజాగా లిఖిత పూర్వకంగా తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటికైనా గడువులోగా పునరుద్ధరణ జరుగపోతే కంపెనీకి ఇచ్చిన రాయితీలను రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి కంపెనీ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని కంపెనీ యాజమాన్యం మంత్రికి హామీ ఇచ్చింది. ఈ దీపావళి పండగకు కార్మికులకు రూ. 10 వేల అడ్వాన్స్ ఇవ్వాలని బిల్ట్ చీఫ్ అపరేటింగ్ ఆఫీసర్ నేహార్ అగర్వాల్‌ను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.