తెలంగాణ

కేసీఆర్ సభ లేనట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రానికి గడువు ముగియనుండటంతో ఇక అక్కడ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సభ లేనట్టేనని పార్టీ వర్గాల సమాచారం. గురువారం అక్కడ జరగాల్సిన సీఎం బహిరంగ సభ రద్దు అయింది. హెలిక్యాప్టర్ ప్రయాణానికి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానయానశాఖ అనుమతించక పోవడంతో రద్దు అయిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా ఎన్నికల ప్రచారానికి శుక్రవారం, శనివారం సాయంత్రం వరకే వ్యవధి ఉండటంతో ఇక అక్కడ సీఎం సభ ఉండకపోవచ్చనే పార్టీ వర్గాలు కచ్చితంగా చెబుతున్నాయి. ఈ నెల 21న హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు 19న సాయంత్రం (శుక్రవారం) వరకు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉంది. అయితే గురువారం సభ నిర్వహణకు చేసిన ఏర్పాట్లన్నింటినీ తొలగించడంతో శుక్రవారం లేనట్టేనని తేలిపోయింది. అలాగే శనివారం
సాయంత్రం ఐదు గంటల వరకే అవకాశం ఉండటంతో జన సమీకరణకు మళ్లీ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే జన సమీకరణకు కూడా పార్టీ నేతలకు రాష్ట్ర కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో శనివారం కూడా సభకు అవకాశం లేదని తెలిసింది. అయితే ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రోడ్ షోలు నిర్వహించి వచ్చారు. సీఎం సభ తర్వాత ప్రచార గడువు ముగిసే రోజు కేటీఆర్ రోడ్ షోలను పెట్టించాలని పార్టీ నాయకులు భావించారు. అయితే మళ్లీ రోడ్ షో లేక బహిరంగ సభకు సంబంధించి ఎన్నికల ఇంచార్జీలకు పార్టీ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కేసీఆర్, కేటీఆర్ సభలు ఉండకపోవచ్చనే పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.