తెలంగాణ

హుజూర్‌నగర్‌లో కుంభవృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్ : రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం హుజూర్‌నగర్‌లో పాల్గొన్ననున్న ఎన్నికల ప్రచార బహిరంగ సభ భారీ వర్షాల కారణంగా రద్దయ్యంది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఈనెల 21న ఎమ్మెల్యే ఉప ఎన్నిక జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎనినకల ప్రచారంలో భాగంగా గురువారం ఇక్కడ జరగాల్సిన సీఎం కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించవలసి ఉండగా మధ్యాహ్నం 1.30 గంటల నుండి 3 గంటల వరకు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురియటంతో సభావేదిక, మైదానం, హెలిపాడ్, రోడ్లు అన్నీ బురదమయ్యాయ. వర్షం కారణంగా హెలికాప్టర్ కిందకు దిగటం కష్టమని అధికారులు తెలపడంతో సభను రద్దు చేసినట్టు విద్యుత్ శాఖమంత్రి జి జగదీశ్‌రెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జ్ ఎంఎల్‌సీ
పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. అంతకు ముందు నియోజకవర్గంలోని ఏడు మండలాల నుండి వేలాది మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు హుజూర్‌నగర్ పట్టణానికి చేరుకున్నారు. కొందరు బహిరంగ సభాస్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆకాశంలో దట్టమైన మేఘాలు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీనితో ఒక్కసారిగా మైదానంలో కూర్చున్న వారంతా కుర్చీలు ఎత్తుకుని నెత్తిన పెట్టుకుని పరుగులు తీశారు. ఈ సందడిలో కుర్చీలు విరగడంతో పాటు మజ్జిగ, మంచినీరు ప్యాకెట్లు నేల పాలయ్యా యి.
హెలిపాడ్ చుట్టూ నీరు
హుజూర్‌నగర్‌లో మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి సీఎం సభా వేదికకు సమీపంలో వరి పొలాల వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్ చుట్టూ వర్షపు నీరు చేరింది. 2 గంటలకు సీఎం కేసీఆర్ వస్తారని టీఆర్‌ఎస్ నాయకులు ప్రకటించగా 1.30 గంటల నుండే భారీ వర్షం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.30 గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో సీఎం బహిరంగ సభ రద్దు చేసుకోవలసి వచ్చింది. మైదానానికి చేరుకున్న కార్యకర్తలు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యారు. సభా వేదిక ఊరు చివర కావటంతో తల దాచుకోవటానికి ఇళ్లు కూడా అక్కడ లేవు. అంతకు ముందు జిల్లా మంత్రి జి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, మల్లయ్యయాదవ్, గాదరి కిషోర్, ఎన్నికల ఇన్‌చార్జ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వీ. చందర్‌రావు, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. కళాకారులు పాటలు, పాడుతూ నృత్యాలు చేస్తున్న తరుణంలో ఒక్క సారిగా ఆకాశం నల్లని మేఘాలు ఆవరించి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది.

హుజూర్‌నగర్‌లో భారీ వర్షంతో రద్దయిన సీఎం కేసీఆర్ బహిరంగ సభా ప్రాంగణ దృశ్యం