తెలంగాణ

క్లైమాక్స్‌కు సమ్మె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తత, కార్మికుల పట్టుదల, ప్రభుత్వ మొండి వైఖరి నేపథ్యంలో, గత 13 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం క్లైమాక్స్‌కు చేరింది. శుక్రవారం నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించడంతో, సమ్మె దాదాపుగా చివరి అంకానికి చేరింది. ఇలావుంటే, సమ్మెపై ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. కార్మికుల ఆందోళనలు రోజు రోజుకు ఉధృతం కావడమే తప్ప, వాడీ వేడి ఏ మాత్రం తగ్గలేదు. ఆర్టీసీ సమ్మెలో గురువారం
మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ తమిళిసై రవాణా మంత్రికి ఫోను చేసి ఆర్టీసీ సమ్మెపై ఆరా తీయడం, హుటాహూటీన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ రాజ్‌భవన్‌కు వెళ్లి సమ్మె దరిమిలా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పట్లను వివరించడం వంటి ఘటనలు చకచకా జరిగిపోయాయి. మరోవైపు ఆర్టీసీ సమ్మె అంశం శుక్రవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెను విరమింప చేయడానికి కార్మికులతో చర్చలు జరుపాలని, ఆర్టీసీకి పూర్తిస్థాయి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)ని నియమించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తమ ఆదేశాలపై ప్రభుత్వం, కార్మిక సంఘాలు తీసుకున్న చొరవపై హైకోర్టుకు శుక్రవారం ప్రభుత్వం నివేదిక సమర్పించాల్సి ఉంది. హైకోర్టుకు విన్నవించే అంశాలు, ప్రభుత్వ వాదనపై సంబంధిత మంత్రి, అధికారులతో ప్రగతిభవన్‌లో ఉదయం నుంచి రాత్రి దాకా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమాలోచనలు జరిపారు. అలాగే కోర్టు ఆదేశం మేరకు ఆర్టీసీకి పూర్తిస్థాయి ఎండిని నియమించే అంశంపై కూడా సీఎం కసరత్తు చేశారు. ఆర్టీసీ కార్మికలు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చి ఆసక్తిరేపిన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు గురువారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి దాకా ప్రగతిభవన్‌లోనే ఉండిపోయారు. సమ్మెపై అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కూడా కేకే పాల్గొనడం విశేషం. హుజూర్‌నగర్ ఉప ఎన్నికల తన సభ వాతావరణ అనుకూలించక వాయిదా పడటంతో సీఎం కేసీఆర్ తన పూర్తి సమయాన్ని ఆర్టీసీ సమ్మెకే కేటాయించి చర్చల్లో మునిగిపోయారు. ఇలా ఉండగా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అనూహ్యంగా మద్దతు ప్రకటించిన తెలంగాణ ఉద్యోగ, గజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ కమిటీ ప్రతినిధి బృందం సచివాలయానికి వచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితో సమావేశమైంది. తమ అపరిష్కృత డిమాండ్లతో పాటు ప్రధానంగా ఆర్టీసీ సమ్మెతో చోటు చేసుకున్న పరిణామాలను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులకు తాము కూడా మద్దతు ప్రకటించామని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమ్మెను విరమింప చేయడానికి చొరవ తీసుకోవాల్సిందిగా కోరింది. లేని పక్షంలో కార్మికుల ఆందోళనలో తాము కూడా భాగస్వాములం కాకతప్పదని హెచ్చరించారు. ఇలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం సాధారణంగా జరగదు. అయితే ఆర్టీసీ సమ్మెపై రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు నిత్యం గవర్నర్‌ను కలిసి సమస్య పరిష్కారం కోసం విన్నవించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీకి వెళ్లడం ఆ సందర్భంగా ఈ అంశాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రచారం జరిగింది. ఆర్టీసీ సమ్మెపై గురువారం ఆమె రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఫోను చేసి ఆరా తీయడంతో కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయానికి మరింత బలం చేకూర్చుంది. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా ఈ నెల 19న అఖిల పక్షాలు, ఆర్టీసీ జేఏసీ సంయుక్తంగా ఇచ్చిన రాష్ట్ర బంద్‌ను విజయవంతానికి వామపక్ష పార్టీలు ధర్నా చౌక్‌లో నిరాహార దీక్ష చేపట్టగా ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని డిపోల వద్ద ధూంధాం కార్యక్రమాలతో ఉద్యమాన్ని మరింత హోరెత్తించారు.