తెలంగాణ

మంత్రులు టచ్‌లో ఉన్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 17: కొంత మంది మంత్రులు తనతో టచ్‌లో ఉన్నారని, ప్రభుత్వంలో ఏదైనా జరగొచ్చని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తన వ్యక్తిగత సెల్‌ఫోన్ నుంచి సమాచారాన్ని ప్రభుత్వం ట్యాప్ చేస్తోందంటూ
ఆయన స్వరం పెంచారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఇలా ఫోన్ ట్యాపింగుకు పాల్పడడం దుర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ మేధావా’ అంటూ నిప్పులు చేరిగారు. 1990 దశకం తొలినాళ్లలో, అధికార తెలుగుదేశం పార్టీలో వచ్చిన సంక్షోభాన్ని కేసీఆర్ మర్చిపోకూడదని హితవు పలికారు. గురువారం ఆర్టీసీ జేఏసీ కార్యాలయంలో జేఏసీ నేతలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సమాజం కేసీఆర్‌ను రెండవసారి ముఖ్యమంత్రిని చేస్తే, ప్రజా సేవను మరచిన ఆయన నిరంకుశ పాలనుకు తెరలేపారని అశ్వత్థామ రెడ్డి మండిపడ్డారు. సమ్మెలేని రాష్ట్రంగా మారుస్తానని సీఎం కేసీఆర్ చెప్పడం ఆయన అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉందిని, కాబట్టి ప్రతిదీ తాను చెప్పినట్టే జరుగుతుందని కేసీఆర్ భ్రమల్లో ఉన్నారని అన్నారు. తన ఏకపక్ష నిర్ణయాలను తెలంగాణ సమాజం ఒప్పేసుకుంటుందని కేసీఆర్ యోచిస్తున్నట్లుగా ఉందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్పారు. ఆర్టీసీ సమ్మెకు సకలజనుల మద్దతు లభిస్తోందని అన్నారు. సమ్మెపై ప్రభుత్వం వైఖరిని నిరసించిన అశ్వత్థామ రెడ్డి దూకుడును పెంచారు. సీఎంపై మాటల యుద్ధానికి దిగారు. సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నందున, ముఖ్యమంత్రి అసహనంతో రగిలిపోతున్నారని అన్నారు. సమ్మెపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల సమంజసంగా లేవని అన్నారు. గత 13 రోజులుగా తెలంగాణలో సమ్మె ప్రభావంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయినప్పటికీ సీఎంలో అసలు చలనమే లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణకు శాశ్వతంగా సీఎంగా ఉండాలని కేసీఆర్ ఉండాలనుకుంటే, అది తప్పే అవుతుందని, ఎవరూ పదవుల్లో ఎప్పటికీ ఉండిపోరని అన్నారు. ప్రజా స్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలన్న విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలన్నారు.ప్రజల మెప్పులేకపోతే పాలన కొనసాగించలేరన్న విషయాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. సమ్మెతో ప్రభుత్వ పునాదులు కదిలిపోతున్నాయని జేఏసీ కన్వీనర్ అన్నారు. సమ్మె పరిష్కారం కాకపోతే 1994 తరహాలో కేబినెట్‌లో సంక్షోభం రావోచ్చు జోస్యం చెప్పారు. కేసీఆర్ కేబినెట్‌లో ఉన్న మంత్రులు సమ్మెకు మద్దతు పలకడాన్ని ఆయన స్వాగతించారు. సీనియర్ మంత్రులు సమ్మెపై స్పందించాలని డిమాండ్ చేశారు. సమ్మెపై అవాకులు చవాకులు పేలినన మంత్రులు ఇప్పుడు ఇళ్లలో కూర్చొని, ఎందుకు వ్యాఖ్యలు చేశామని ఆందోళన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా జేఏసీతో చర్చలకు ముందకు రావాలని ఆయన కోరారు. సమ్మె న్యాయమైనది కాబట్టే కర్నాటక ఆర్టీసీ కార్మిక సంఘాలు మద్దతు తెలపడానికి హైదరాబాద్ వచ్చారన్నారు. పోరు మరింత ఉధృతంకాక ముందే ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఒక మెట్టుదిగాలని, అందకు తాము సైతం మెట్టుదిగుతామని స్పష్టం చేశారు. తెలంగాణను సాధించుకోవడానికి చేసిన పోరాటాలను తాము ఇంకా మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. ఉద్యమ స్ఫూర్తి ఇంకా ఆర్టీసీ కార్మికల్లో తగ్గలేదని అన్నారు. ప్రభుత్వంలో, ఎప్పుడైనా, ఏమైనా జరగవచ్చని అన్నారు. కోర్టులను సైతం మభ్యపెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నించడం శోచనీయమని చెప్పారు. సమ్మె పరిష్కరించడానికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశిస్తున్నా సీఎం కేసీఆర్ మాత్రం చర్చలు లేవంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల ఇబ్బందులు, న్యాయస్థానాల ఆదేశాలను సైతం ముఖ్యమంత్రి లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న కేసీఆర్ నియంతను తలపిస్తున్నారన్నారు.

*చిత్రం... ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి