తెలంగాణ

ఎన్‌సీసీ క్యాడెట్లకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి సంవత్సరం సాలీనా 17.5 మిలియన్ల మంది గుండె జబ్బుల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని అపోలో హాస్పిటల్స్ సీఎస్‌ఆర్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని అన్నారు. ప్రమాదాలు, గుండె పోటు వంటివి అత్యవసర పరిస్థితులకు కారణమవుతాయన్నారు. సంక్లిష్టపరిస్థితుల్లో రోగులను కాపాడేందుకు నైపుణ్యం, వ్యవహరించాల్సిన తీరు అవసరమన్నారు. బుధవారం ఇక్కడ ఆమె అత్యవసర పరిస్థితుల్లో రోగులను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై 1600 మంది ఎన్‌సీసీ క్యాడెట్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతవరకు తమ సంస్థ పదివేల మంది ఎన్‌సీసీ క్యాడెట్లకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పరు. బేసిక్ లైఫ్ సపోర్టుపై క్యాడెట్లకు శిక్షణ ఇవ్వడం వల్ల సమాజానికి మేలు చేసినట్లవుతుందన్నారు.
బేసిక్ లైఫ్ సపోర్టు అనేది రోగులు ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి తదుపరి వైద్య సేవలు అందించేవరకు వారిని కాపాడే ప్రక్రియ అన్నారు. ఎమర్జన్సీ టీమ్ సభ్యుడు, సుప్రసిద్ధవైద్యుడు డాక్టర్ అజహరుద్దీన్ మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో రోగుల రక్తప్రసరణ, గాలి పీల్చుకునే మార్గం, శ్వాసను పరీక్షించాలన్నారు. మొదట రక్తప్రసరణను తనిఖీ చేయాలని, గుండె అవయవాలనుకు రక్తాన్ని సరిగా పంపిస్తున్నదా లేదా అనే దానిని నిర్థారించుకోవాలన్నారు. భారతదేశంలో గుండె జబ్బుల వల్ల క్యాన్సర్ కంటే మూడు రెట్లు అధికంగా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బేసిక్ లైఫ్ సపోర్టుకు సంబంధించి నాణ్యమైన శిక్షణనున తీసుకోవాలన్నారు.