తెలంగాణ

లైఫ్ సైనె్సస్ హబ్‌గా హైదరాబాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: లైఫ్ సైనె్సస్ రంగానికి హైదరాబాద్ నగరం హబ్‌గా మారబోతుందని పరిశ్రమలశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా-2020 తర్వాత లైఫ్ సైనె్సస్ రంగంలో ఈ స్థానం మరింత సుస్థిరం కానుందన్నారు. ఈ రంగంలో హైదరాబాద్‌ను మరింత సుస్థిరం చేసే దిశగా ప్ర భుత్వం కృషి చేస్తుందన్నారు. బు ధవారం నాడిక్కడ టీఎస్‌ఐఐసీ కా ర్యాలయంలో బయో ఏషియా- 2020 వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఫిబ్రవరిలో జరుగను న్న బయో ఏషియా సదస్సుకు 55 దేశాల నుంచి 18 వందల మంది హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ, రానున్న రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా, లైఫ్ సై నె్సస్ రంగ అభివృద్ధికి పలు చర్య లు తీసుకుంటున్నామని అన్నారు. ‘టుడే ఫర్
టుమారో’ అంశంతో బయో ఏషియా సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఇప్పటికే ప్రఖ్యాత లైఫ్ సైనె్సస్ కార్యక్రమాల్లో బయో ఏషియా ఒకటిగా నిలిచిందన్నారు. గతంలో ఇక్కడ నిర్వహించిన బయో ఏషియా సదస్సు వల్లనే ఈ రంగం ఇక్కడ ఎదగడానికి దోహదం చేసిందని మంత్రి గుర్తు చేశారు. వచ్చే ఏడాది ఇక్కడ నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు జర్మనీ సంయుక్త భాగస్వామిగా వ్యవహరిస్తుందన్నారు. అలాగే కేరళ, అస్సాం రాష్ట్రాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయన్నారు. ఈ సదస్సులో స్టార్టప్ల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. వందకు పైగా కంపెనీలు రానున్నాయని అన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు టీఎస్‌ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారెడ్డి, లైఫ్ సైనె్సస్ డైరెక్టర్ శక్తి నాగప్ప పాల్గొన్నారు.

*చిత్రం... టీఎస్‌ఐఐసీ కార్యాలయంలో బయో ఏషియా-2020 వెబ్‌సైట్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్