తెలంగాణ

‘హరితహారం’ తెలంగాణకు ‘మణిహారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం ఈ రాష్ట్రానికి మణిహారంగా మారిందని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన అధికారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ పేర్కొన్నారు. ‘వాతావరణ మార్పులు-అడవులపై ప్రభావం’ అనే అంశంపై ఇక్కడి అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) లో బుధవారం ఏర్పాటు చేసిన జాతీయ సెమినార్‌లో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం అటవీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నదన్నారు. అటవీరక్షణ, అటవీ పునరుజ్జీవం, పచ్చదనం పెంపుదల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీ శాఖ సిబ్బంది యావత్తూ నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. హైదరాబాద్ చుట్టూ అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్న అర్బన్ పార్కుల గురించి ఆమె వివరిస్తూ ఉంటే వివిధ రాష్ట్రాల పీసీసీఎఫ్‌లు ఆసక్తితో విన్నారు. హైదరాబాద్ చుట్టూ చేపట్టిన అర్బన్ పార్కులు ప్రజలకు మంచి పర్యావరణ ఆస్తులుగా మిగులుతాయన్నారు. రాష్టమ్రంతటా హరితహారం, అటవీ పునరుద్దరణ చేపట్టామని తెలిపారు. వాతావరణ మార్పులు, అడవుల సంరక్షణపై ఆస్కీ ఈ నెల 14 నుండి 18 వరకు వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సెమినార్‌తో పాటు క్షేత్రస్థాయిలో అటవీ పెంపకం ఎలా సాగుతుందో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన అటవీ అధికారులు హైదరాబాద్ చుట్టుప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు.
గజ్వేల్ శరీఫ్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలోని సింగరాయపల్లిలో క్షీణించిన అటవీ ప్రాంతాన్ని కళకళలాడే అటవీ ప్రాంతంగా మార్చిన వైనాన్ని వివిధ రాష్ట్రాల అధికారులు చూశారు. గజ్వేల్, కోమటిబండ ప్రాంతాల్లో ప్రధాన రోడ్లు, గ్రామీణ రోడ్ల ఇరువైపులా అభివృద్ధి చేసిన రహదారి వనాలను (అవెన్యూ ప్లాంటేషన్) పరిశీలించారు. సమగ్ర రక్షణ చర్యలు తీసుకోవడం వల్ల తక్కువ సమయంలోనే మొక్కలు ఏపుగా పెరిగిన విషయాన్ని వివిధ రాష్ట్రాల అధికారుల బృందానికి తెలంగాణ అధికారులు వివరించారు. సింగరాయపల్లి ప్రాంతంలో అటవీ రక్షణ కోసం తవ్విన కందకాలు, గట్లపై సహజసిద్దమైన కంచెగా పెంచుతున్న గచ్చకాయ చెట్లను పరిశీలించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ నేతృత్వంలో అడవుల పెంపకం, రక్షణ కోసం తీసుకున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని వివిధ రాష్ట్రాలకు చెందిన పీసీసీఎఫ్‌లు ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికను తమ తమ రాష్ట్రాల్లో అమలు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరాంచల్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, జార్ఖండ్, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎం కార్యాలయంలో ఓఎస్‌డీగా పనిచేస్తున్న ప్రియాంక వర్గీస్, హైదరాబాద్ చీఫ్ కన్సర్వేటర్ చంద్రశేఖరరెడ్డి, మెదక్ రేంజ్ సీసీఎఫ్ శరవణన్, ఆస్కీ ప్రోగ్రాం డైరెక్టర్ వల్లిమాణికం, మేడ్చల్, సిద్ధిపేట జిల్లాల అటవీ అధికారులు సుధాకర్‌రెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...వివిధ రాష్ట్రాల అటవీ అధికారులతో కలిసి అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్న రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన అధికారి శోభ