తెలంగాణ

రాష్ట్ర అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధికోసం సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ-సెంటర్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ (సీఈజీఐఎస్) మధ్య బుధవారం త్రైపాక్షిక అవగాహనా ఒప్పందం కుదిరింది. తెలంగాణ ఆర్థిక శాఖ కార్యదర్శి కే. రామకృష్ణారావు, సీఈజీఐఎస్ ఫౌండర్, సైంటిఫిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ కార్తిక్ మురళీధరన్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్‌రావు, స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్-చైర్మన్ బి. వినోద్‌కుమార్‌ల సమక్షంలో ఒప్పంద పత్రాలను ఇరువురు అధికారులు పరస్పరం అందచేసుకున్నారు. సామాజిక-ఆర్థిక అంశాల్లో సత్ఫలితాలు వచ్చేందుకు, ప్రజాధనం వినియోగంలో నాణ్యత సాధించేందు వీలుగా అవగాహనా ఒప్పందం ద్వారా చతుర్ముఖ వ్యూహాన్ని రూపొందించారు.
వేర్వేరు రంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి వివరాలను ఎప్పటికప్పుడు సేకరించడం, ఆ యా రంగాల సామర్థ్యం పెంపొందించేందుకు యాజమాన్య నిర్వహణకు ఈ వివరాలను ఉపయోగించడం, ప్రజాధనాన్ని సమర్థతగా వినియోగించడానికి వ్యూహాత్మక బడ్జెట్‌ను, ప్రణాళికను రూపొందించడం, కీలక రంగాల్లో విధాన పత్రాలను రూపొందించడం, వాటిని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని నిర్ణయించారు.
వివిధ శాఖలు వేగంగా ముందుకు సాగేందుకు లక్ష్యాలను రూపొందించుకునేందుకు ఈ నివేదికలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి, సంక్షేమ చర్యలు మరింత సమర్థతగా ఉండాలన్నదే ఈ అవగాహనా ఒప్పందం ఉద్దేశాలుగా ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని, సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో జాతీయ స్థాయిలో ఆదర్శంగా ఉండాలన్నదే ఒప్పందం లక్ష్యాలని వివరించారు. బంగారు తెలంగాణ సాధనలో ఈ అవగాహనా ఒప్పందం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

*చిత్రం...మంత్రి హరీష్‌రావు, ప్రణాళికా మండలి రాష్ట్ర వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ నేతృత్వంలో ఎంఓయూ పత్రాలను పరస్పరం అందజేసుకుంటున్న అధికారులు