తెలంగాణ

ఆర్టీసీ సమస్యకు తెరదించాలి: జనవాహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యకు వెంటనే తెరదించాలని జనవాహని పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు డీఎస్‌ఎన్‌వీ ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించారు. ఇరు వర్గాల తీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై హర్షం ప్రకటించారు. కోర్టు ఆదేశించిన విధంగా, అనుసరణీయమైన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసుకొని, సమస్యకు తెరదించాలని సమావేశం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో పార్టీ నేతలు కోరారు. ఆర్టీసీ సమ్మెకు దారితీసిన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, పర్యవసానంగా బాధపడుతున్నది మాత్రం సామాన్యుడేనని పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రసాద బాబు వ్యాఖ్యానించారు. విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగే ప్రమాదం ఉందని, కాబట్టి, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సర్కారు దృష్టి సారించి, తీవ్రమైన పరిస్థితులు ఉత్పన్నం కాకుండా జాగ్రత్త పడాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యా సంస్థలకు సెలవులను పెంచడం ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. పార్టీ గ్రేటర్ హైదరాబాద్ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ బీ. లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. అదే నిజమైతే, ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వర్గాలకు దోచిపెట్టడం సరైన విధానం కాదన్నారు. తెలంగాణ ఉధ్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు విధ్వంసకారులుగా కనిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఉచిత విద్య, వైద్య, నీరు కోసం తమ పార్టీ లక్ష్యమని అన్నారు. సారూప్యతగల పార్టీలతో కలిసి పని చేస్తామన్నారు. ఈ సమావేశంలో జనవాహిని తెలంగాణ శాఖ అధ్యక్షుడురాలు పీ. నిర్మలాదేవి, ప్రధాన కార్యదర్శి ఎం. కిషోర్ బాబు, కోశాధికారి బీ. గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.