తెలంగాణ

అర్హులకే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16 : స్టోర్ట్స్ కోటా కింద ప్రభుత్వం కల్పించిన రెండు శాతం ఉద్యోగాల రిజర్వేషన్ అర్హులకు మాత్రమే ఉపయోగపడేలా ఉండాలని రాష్ట్ర టూరిజం, క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. క్రీడాప్రాధికార సంస్థపై ఎల్‌బీ స్టేడియంలో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం రూపొందించిన నియమావళిపై సమీక్షించేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ సూచనలకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ, 2014 తర్వాత రాష్ట్రంలో 45 స్టేడియంలను నిర్మించామన్నారు. క్రీడా శాఖకు చెందిన ఆస్తులన్నింటినీ డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. క్రీడా శాఖకు చెందిన భూములను లీజ్‌కు తీసుకుని అద్దె చెల్లించకుండా కోర్టుకు వెళ్లిన వారి వివరాలను అందచేయాలని సూచించారు. మార్కెట్ ధరలకు అనుగుణంగానే క్రీడల శాఖకు చెందిన భూములకు కూడా లీజ్ పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలోని యువతను క్రీడాకారులుగా రూపుదిద్దేందుకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు దినకర్‌బాబు, సుజాత తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్