తెలంగాణ

విద్యుత్ కార్మికుల భారీ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకుండా కాలయాపన చేయడాన్ని విద్యుత్ కార్మికులు తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం మింట్ కాంపౌండ్‌లో జరిగిన ధర్నాకు వేలాదిమంది విద్యుత్ ఆర్టిజన్లు హాజరు అయ్యారు. తమ డిమాండ్ల తక్షణం ఆమోదించాలని నినాదాలు చేశారు. విద్యుత్ అధికారుల వైఖరికి నిరసనగా ఈనెల 23న వరంగల్‌లో భారీ ధర్నా చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చైర్మన్ పద్మారెడ్డి, కన్వీనర్ శ్రీ్ధర్ తెలిపారు. విద్యుత్ అధికారులు చర్చల పేరుతో సమావేశాలను వాయిదాలు వేస్తూ పోవడాన్ని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు దపాలుగా చర్చలకు పిలిపించారని, అయితే చర్చల్లో సానుకూలత రాకపోవడంతో తాము నిరసన వ్యక్తం చేశామన్నారు. ఈనెల 15న జరిగిన చర్చల్లో అధికారులు తమ డిమాండ్లపై పూర్తిస్థాయిలో చర్చంచలేదన్నారు. ఈపీఎఫ్, జీపీఎఫ్‌లను అమలు చేయాలన్నారు. పాత స్కేల్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మిగిలిపోయిన 6500 మంది ఆర్టిజన్లన్లుగా గుర్తించాలన్నారు. ఎగ్జిస్టింగ్‌లో విధానంలో ఉన్న వారికి న్యాయం చేయాలన్నారు. పాత స్టాండింగ్ విధానాలను అమలు చేయడానికి అధికారులు కృషి చేయలన్నారు. 23వేల ఆర్టిజన్లను తక్షణం పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

*చిత్రం...హైదరాబాద్‌లోని మిండ్ కాంపౌండ్ వద్ద బుధవారం ధర్నా చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు