తెలంగాణ

సాగర్ డ్యాంను పరిశీలించిన రాష్ట్ర భద్రతా బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, అక్టోబర్ 15: నాగార్జునసాగర్ ప్రాజెక్టును మంగళవారం నాడు స్టేట్ డ్యాం సేఫ్టీ ఆర్గనైజేషన్ టీమ్ సందర్శించి పరిశీలించారు. రిటైర్డ్ ఈఎన్‌సీ కేఎస్‌ఎన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ బృందం ప్రాజెక్టులోని పలు సున్నితమైన విభాగాలను సందర్శించి పరిశీలించారు. దీనిలో భాగంగా సాగర్ డ్యాం క్రస్టు గేట్లను స్పిల్‌వేను, గ్యాలరీలను, సీపేజ్‌లను పరిశీలించి నమోదు చేసుకున్నారు. దీంతో పాటు మట్టి ఆనకట్టల పటిష్టతను పరిశీలించారు. ఈ బృందం గ్యాలరీల లోపలికి చేరుకుని డ్యాం నుండి వస్తున్న సీపేజ్‌తో పాటు డ్యాం అంతర భాగంలోని పలు సున్నితమైన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నర్సింహ్మా మాట్లాడుతూ ప్రపంచ బ్యాంక్ నిధులతో సాగర్ ఆధునీకరణ సమయంలో డీఎస్‌ఆర్‌పీ సందర్శించి పరిశీలించేదన్నారు. ఇప్పుడు ఆ టీమ్ గడువు పూర్తి అయినందున సాగర్ డ్యాం పూర్తిగా నిండిన సందర్భంగా రాష్ట్ర ప్రాజెక్టుల భద్రత అధ్యయన కమిటీ సందర్శించి పరిశీలించారన్నారు. వీరితో పాటు సీఈసీడీఓ శ్రీనివాస్, సాగర్ డ్యాం ఎస్‌ఈ మధుసూదన్, ఈఈ యలమంద పాల్గొన్నారు.