తెలంగాణ

కలాంకు బీజేపీ నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు మాజీ రాష్టప్రతి ఏపీజే అబ్దుల్ కలాం అని బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి అన్నారు. మంగళవారం ఇక్కడ జరిగిన కలాం జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరంతర శ్రమతో ఉన్నత శిఖరాలు అధిరోహించిన కలాం జీవిత ప్రస్థానం నిజంగా అద్భుతమన్నారు. దేశం కోసం బ్రహ్మచారిగా ఉండిపోయి శాస్త్ర విజ్ఞాన ఫలాలను ప్రజలకు అందించారన్నారు. కలాం తన పుస్తకం ఇండియా 2020లో 2020 నాటికి భారత్‌ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అభివృద్ధి ప్రణాళికలు సూచించారన్నారు. దేశం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారన్నారు. కలాం ఆశయాలసాధనకు యువత అంకితం కావాలని ఆయన కోరారు.