తెలంగాణ

కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎల్‌ఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లల్లో లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌ను (ఎల్‌ఆర్‌ఎస్) ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించిన నిబంధనలను మంగళవారం విడుదల చేసింది. మార్చి 30, 2018 నాటికి ఉన్న స్థలాల క్రమబద్ధీకరణకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు సమర్పించడానికి 90 రోజుల గడవు విధించింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుతో పాటు స్థలం విలువలో పది శాతం లేక రూ. 10 వేలు కానీ ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. మున్సిపాలిటీల పరిధిలో క్రమబద్ధీకరణ అధికారాన్ని సంబంధిత మున్సిపాలిటీలకు, నగర అభివృద్ధి పరిధిలో ఉంటే సంబంధించిన అర్బన్ డవలప్‌మెంట్ అథారిటీలకు, హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారిటీకి అప్పగించింది. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు ఆమోదం పొందితే ఆరు నెలల వ్యవధిలో క్రమబద్దీకరణ రుసుం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. చెరువులు, కుంటలు, నీటి వనరులు, శిఖం భూముల్లోని స్థలాలకు క్రమబద్ధీకరణ వర్తించదని పేర్కొంది.