తెలంగాణ

విద్యుత్ కార్మికులతో యాజమాన్యం చర్చలు సఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమ్మెపై యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు ఆర్టీసీ రాష్ట్ర విద్యుత్ కార్మికుల సంఘం అధ్యక్షుడు జాన్సన్, ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 23వేల మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేశారన్నారు. స్టాండింగ్ రూల్స్ అన్నింటికీ పూర్తిగా సానుకూలంగా ఉన్నారన్నారు. ఇక్రిమెంట్లు, డీఏ ఇచ్చేందుకు యాజమాన్యం సానుకూలంగా ఉందన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎండి ప్రభాకరరావుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారన్నారు. 13,357 అదనపు పోస్టులను గతంలోనే మంజూరు చేశారన్నారు.
ఆంధ్రాలో కంటే తెలంగాణలో మెరుగైన పీఆర్‌పీ ఇచ్చారన్నారు. 23వేల మంది ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కేసీఆర్ ప్రతిపాదించారని, కాని కొంత మంది నిరుద్యోగ యువత కోర్టులో కేసు వేయడం వల్ల పెండింగ్‌లో ఉందన్నారు. 1999 సంవత్సరం నుంచి 2014 వరకు విద్యుత్ కార్మికులుగా చేరిన వారికి పెన్షన్ ఇచ్చేందుకు యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. రెగ్యులర్ ఉద్యోగులు మాదిరిగా అన్ని వసతులు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారన్నారు.