తెలంగాణ

పరిశుభ్రతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ప్రణాళిలను రూపొందిస్తున్నట్టు పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. 30 రోజుల గ్రామాల ప్రత్యేక ప్రణాళిక మంచి ఫలితాలివ్వడంతో అదే స్ఫూర్తిని పట్టణాల్లోనూ చేపట్టబోతున్నట్టు వివరించారు. సచివాలయం నుంచి మంగళవారం ఉదయం కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టణ పారిశుధ్య నిర్వహణపై ప్రతి పురపాలిక ప్రణాళికను తయారు చేయాలని మంత్రి ఆదేశించారు. వ్యర్థా ల సేకరణ రీసైక్లింగ్ వరకు అన్ని వివరాలను ప్రణాళికలో చేర్చాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్ మార్గదర్శకాల మేరకు పురపాలికల్లో ఉండాల్సిన పారిశుధ్య కార్మికులకు సరిపడే విధంగా వాహనాలను సమకూర్చాలని. ఇప్పటికే పాత పురపాలికలు, నగరాలకు స్వచ్ఛ ఆటోలు ఇచ్చామని, అవసరమైతే
వాహనాలు, సిబ్బందిని పెంచుకోవచ్చని మంత్రి సూచించారు. పారిశుద్ధ్య
కార్మికులకు యూనిఫామ్‌తో పాటు సామాగ్రిని సమకూర్చాలని అన్నారు. అలాగే ప్రతి కార్మికునికి పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం ఉండాలన్నారు. పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం కల్పించబోయే జీవిత బీమా మాదిరిగానే పురపాలక సిబ్బందికి కూడా కల్పిస్తామన్నారు. ప్రతి పట్టణంలో డంప్ యార్డు ఉండాలని, లేని చోట స్థల సేకరణ చేయాలని ఆదేశించారు. ప్రతి పట్టణం, నగరంలో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పెట్రోల్ బంక్, రెస్టారెంట్స్‌లో టాయిలెట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. వరంగల్, సిరిసిల్ల మాదిరిగా ప్రతి పట్టణంలో మానవ వ్యర్దాల ట్రీట్‌మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పట్టణానికి సంబంధించిన సమగ్రమైన పారిశుద్ధ్య ప్రణాళికలను తయారు చేసి వారం రోజుల్లో డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్స్‌కు సమర్పించాలని మంత్రి ఆదేశించారు.

*చిత్రం... కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్