తెలంగాణ

21న ప్రగతి భవన్ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈనెల 21న ప్రగతి భవన్‌ను ముట్టడించనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. చర్చలకు సిద్ధమైన పార్లమెంటు సభ్యుడు కే. కేశవరావు (కేకే)కు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ లభించలేదా? అని ప్రశ్నించింది. ఆత్మహత్యలకు పాల్పడకుండా, పోరాడి హక్కులను సాధించుకోవాలని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేసింది. సమ్మె ఉధృతంగా మారినప్పటికీ, రాష్ట్ర మంత్రి హరీష్‌రావు పట్టించుకోకపోవడం తగదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో ఆర్టీసీ కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షుడిగా హరీష్ రావు వ్యవహరించిన విషయాన్ని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీగా ఉన్న కేకేకు కూడా సమ్మెపై కేసీఆర్ నుంచి అపాయింట్‌మెంట్ లభించాల్సి ఉందని పేర్కొన్నా రు. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే అనుమా నం తలెత్తుతుందని
మంగళవారం ఇక్కడ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ, సీనియర్ నేత షబ్బీర్ అలీతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడిన రేవంత్ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించకపోగా, తొలగిస్తున్నామని ప్రకటన చేసిన కేసీఆర్ వారిని అభద్రతాభావానికి గురి చేశారని అన్నారు. ఈ నెల 19వ తేదీలోపల కార్మికుల డిమాండ్లను పరిష్కరించని పక్షంలో 21న ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించారు. అహంభావ వైఖరిని విడనాడాలని ముఖ్యమంత్రికి హితవు పలికారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కార్మికులపై పెత్తనం చేయడం ఏమిటని నిలదీశారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా, ఆర్టీసీ జేఏసీ నేతలను చర్చలకు పిలిచి మాట్లాడాలని సూచించారు. ఈ నెల 19వ తేదీన జరిగే బంద్‌కు కాంగ్రెస్‌తోపాటు వివిధ అనుబంధ అనుబంధ సంఘాలు మద్దతునిస్తాయని రేవంత్ అన్నారు. ఇటీవల ప్రగతిభవన్‌లో కుక్క చనిపోయిందనే కారణంపై ఒక వెటర్నరీ డాక్టర్‌పై కేసు నమోదు చేశారని చెప్పారు. ఇద్దరు కార్మికులు ఆత్మహుతి చేసుకున్నారని, ఈ విషయంలో ప్రభుత్వంపై ఎందుకు కేసు నమోదు చేయకూడదని ప్రశ్నించారు. మంత్రుల బాధ్యతారాహిత్యం వల్లే కార్మికులు చనిపోయారని విమర్శించారు. మంత్రులు ఎర్రబెల్లి, తలసానిపై కేసులు నమోదు చేయాలన్నారు. కార్మికులను రెచ్చగొట్టే ప్రకటనలు చేయరాదని వారిని కోరారు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోరాదని, కార్మికులకు అండగా తాము ఉన్నామని ఆయన ఆర్టీసీ కార్మికులకు చెప్పారు. కేసీఆర్ మెడలు వంచి ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై వత్తిడి తెస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వంలో విలీనం చేయకుండా, కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలిస్తామని గతంలో కేసీఆర్ పేర్కొన్నారని రేవంత్ గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులు 11 రోజులుగా సమ్మె చేస్తుంటే, ప్రగతిభవన్‌కు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించి మాట్లాడడం సరికాదని వ్యాఖ్యానించారు
ఏ రాష్ట్రంలోనూ దొర పాలన లేదు: రాజనర్శింహ
దేశంలో తెలంగాణ తరహాలో దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ దొర పాలన లేదని, ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను ఆమోదించకుండా ఉద్యమాన్ని తొక్కేయాలని చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ ఆరోపించారు. కేంద్రం కూడా ఆర్టీసీ సమ్మెపై స్పందించాలని కోరారు. ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ కేంద్ర పెద్దలతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారని ఆశించినట్టు చెప్పారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజల సమస్యల గురించి ఆలోచించడం మంత్రులు మానివేశారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధంలేనివారు సమ్మె గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇష్టానుసార ప్రకటనలు చేయవద్దు: షబ్బీర్ అలీ
ఆర్టీసీ సమ్మె అంశంపై మంత్రులు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేస్తూ కార్మికులను భయభ్రాంతులకు గురిచేయడం తగదని కాంగ్రెస్ సీనియర్ నేత మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. 48వేల మంది కార్మికులను డిస్మిస్ చేసినట్లు కేసీఆర్ ప్రకటన చేస్తే, చర్చలకు రావాలని ఎంపీ కేకే ఆహ్వానిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌తో కూడా మాట్లాడలేని స్థితిలో కేకే ఉన్నారని ఎద్దేవా చేశారు. అనుభవం లేని డ్రైవర్లను నియమించడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి