తెలంగాణ

సమ్మెకు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది. మంగళవారం ఎవరూ ఊహించని రీతిలో తెలంగాణ నాన్ గజిటెడ్ ఆఫీసర్స్ సంఘం (టీఎన్‌జీవో), తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో), విద్యుత్ కార్మిక సంఘాల సమాఖ్య తదితర సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంపూ ర్ణ మద్దతు ప్రకటించాయి. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఇప్పటికే బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఆర్టీసీ కార్మికుల ఆందోళనలో భాగస్వాములం అవుతామని టీఎన్‌జివో, టీజివోలు ప్రకటించాయి. అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన విధంగా, సకల జన సమ్మెకు కూడా వెనుకాడేది లేదని మద్దతు ప్రకటించిన సంఘాలు సంయుక్తంగా హెచ్చరించాయి. ఆర్టీసీ కార్మికుల డి మాండ్లతో పాటు ఉద్యోగుల డిమాండ్లపై బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించిన తర్వాత తమ కార్యాచరణను ప్రకటిస్తామని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) కన్వీనర్ కారం రవీందర్‌రెడ్డి, కో-కన్వీనర్ మమత మీడియాకు వెల్లడించారు. ఇలావుంటే, ప్రభుత్వం నుంచి చర్చలకు తమకు ఎలాంటి పిలుపు రాక పోవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. చర్చలకు రావాలని పార్లమెంటు సభ్యుడు కేశవరావు తమను కోరినప్పటికీ, ఆయన నుంచి కూడా తమకు ఎలాంటి తదుపరి సమాచారం లేదన్నారు. ప్రభుత్వం మైండ్ గేమ్
ఆడుతున్నట్టు అర్థమైందని అశ్వత్థామరెడ్డి విమర్శించారు.
టీఎన్‌జీవో, టీజీవోలతో సమావేశం
సమ్మెకు మద్దతు కోరుతూ మంగళవారం సాయంత్రం ఆర్టీసీ జేఏసీ నాయకులు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, థామస్‌రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం టీఎన్‌జివో భవన్‌కు వచ్చి సమావేశమయ్యారు. అప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇవ్వాలా? లేదా? అనే అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, సిబ్బంది, కార్మిక, పెన్షనర్ల సంఘాల కమిటీ (జేఏసీ) సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించకపోతే భవిష్యత్‌లో తమకు మద్దతు ఉండదని టీఎన్‌జీవో. టీజీవోల జిల్లా కమిటీలు జేఏసీపై గట్టిగా పట్టుబట్టాయి. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెను నిర్వీర్యం చేయడానికి ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం పావుగా వాడుకుంటుందన్న విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తున్నదని సమావేశంలో పాల్గొన్న నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, కార్మికుల ఐక్యతను చాటడానికి, భవిష్యత్తులో అన్ని వర్గాల మద్దతు నిలబెట్టుకోవడానికి వీలుగా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఉద్యోగుల జేఏసీ నిర్ణయించింది. ఈ విషయాన్ని తమ మద్దతు కోరడానికి వచ్చిన ఆర్టీసీ జేఏసీ నాయకులతో కలిసి సంయుక్తంగా మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధకరమని ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ కారం రవీందర్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. బుధవారం తమ జేఏసీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లతో పాటు ఉద్యోగుల డిమాండ్లపై చర్చిస్తామన్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే మరో సకల జన సమ్మెకైనా వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించారు. సీఎస్‌కు కలిశాక తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతు ప్రకటించే విషయంలో కొన్ని అపోహల వల్ల తమపై దుష్ప్రచారం జరిగిందన్నారు. ఆర్టీసీ నేతలతో చర్చించాక అవి తొలిగిపోయాయని అన్నారు. ఉద్యోగ సంఘాలపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఆర్టీసీ జేఏసీ కన్వీరర్ అశ్వత్థామరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై తమ తరఫున ప్రతినిధిగా ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ కారం రవీందర్‌రెడ్డిని పంపించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉద్యోగ సంఘాల జేఏసీ తమకు మద్దతు ప్రకటించడం పట్ల అశ్వత్థామరెడ్డి హర్షం ప్రకటించారు.

*చిత్రం...ఆర్టీసీ జేఏసీ నేతలతో కలిసి సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్న టీఎన్‌జీవో, టీజీవో నాయకులు