తెలంగాణ

దేశరక్షణలో అనుక్షణం అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: భారతీయ సైనికులు దేశ రక్షణలో అనుక్షణం అప్రమత్తంగా ఉన్నారని సికింద్రాబాద్‌లోని 1ఈఎంఈ సెంటర్ కమాండెంట్ బ్రిగేడియర్ సందీప్ బల్లా పేర్కొన్నారు. 1 ఈఎంఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్) 77 వ కార్ప్స్‌డే ను మంగళవారం ఇక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సైనిక్ సమ్మేళన్’లో మాట్లాడుతూ, 1 ఈఎంఈకి చెందిన అధికారులు, సైనికులు కష్టపడి పనిచేస్తున్నారని అభినందించారు. అమరులైన వీర సైనికులకు ఈ సందర్భంగా సందీప్ బల్లాతో పాటు ఎంసీఈఎంఈ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ పరంజిత్ సింగ్ నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న వారితో పాటు పదవీ విరమణ చేసిన దాదాపు 2000 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.