తెలంగాణ

సీఎం ఆదేశిస్తేనే చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సమ్మె విరమించి చర్చలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన రాజ్యసభ సభ్యుడు కే కేశవరావుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఎలాంటి పిలుపు రాలేదు. దీంతో ఆయన మంగళవారం ఉదయం నుంచి సీఎం పిలుపు కోసం వేచి చూశారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తేనే చర్చలు జరుపుతానని తనను కలిసిన మీడియాకు కేశవరావు వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం మినహా మిగతా డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు ప్రకటించిన కేశవరావు మాట మార్చారు. కార్మికులతో చర్చలు జరపడానికి తనకు ఎలాంటి అధికారం లేదన్నారు. అయినా ఆర్టీసీ సమ్మె ప్రభుత్వ సమస్య తప్ప తమ పార్టీ సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలో పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం ఉందనే తాను స్పందించినట్టు తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై తన ప్రకటనకు ముందు సీఎం కేసీఆర్‌తో చర్చించలేదన్నారు. ప్రభుత్వం, కార్మికులు పరస్పరం చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలనే సూచించినట్టు చెప్పారు. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపుతానని చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే చర్చలు జరపడానికి ఇప్పటికీ సిద్ధమేనని కేకే స్పష్టం చేశారు. తాను మొదటి నుంచి సోషలిస్ట్ భావాలు ఉన్న వ్యక్తినని, రాజ్యం వైపు కాకుండా కార్మికుల పక్షపాతిగానే ఉంటానని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాకపోవచ్చాన్నారు. ఒకవేళ ప్రభుత్వం విలీనం చేస్తామంటే తనకేమి అభ్యంతరం లేదన్నారు. ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో తనకు తెలియదన్నారు. ఇలా ఉండగా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశే్వశ్వర్‌రెడ్డి మంగళవారం ఉదయం కేశవరావును ఇంటికి వచ్చి కలిశారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కేకేను కోరారు. సీఎం ఆదేశిస్తే చర్చలు జరపనున్నట్టు కేకే చెప్పినట్టు కొండా మీడియాకు తెలిపారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేకే విడుదల చేసిన ప్రకటనతో సమ్మె పరిష్కారం అవుతుందన్న ఆశలు చిగురించాయన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆవేదన టీఆర్‌ఎస్ నేతలకు పట్టడం లేదన్నారు. కేశవరావు మాత్రమే మనసున్న వ్యక్తిగా స్పందించారని కొండా అన్నారు. సీఎం మొండిగా వ్యవహరిస్తున్నారని, పోలీసులతో రాష్ట్రాన్ని పాలించాలని చూస్తున్నారని కొండా విమర్శించారు. పోలీసులు తప్ప మరెవ్వరు సీఎంకు అవసరం లేదని దుయ్యబట్టారు.
*చిత్రం... కే కేశవరావు