తెలంగాణ

పంచాయతీకో ‘నర్సరీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: మొక్కల పెంపకానికి సంబంధించి చేపట్టిన ‘పచ్చదనం-పరిశుభ్రత’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 7.32 లక్షల మొక్కలను నాటామని హరితహారం ప్రత్యేక అధికారి, సీఎం వద్ద ఓఎస్‌డీగా పనిచేస్తున్న ప్రియాంక వర్గీస్ తెలిపారు. మంగళవారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, 30 రోజుల ప్రణాళికలో తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత లభించిందన్నారు. అటవీ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీకి ‘హరిత కార్యాచరణ ప్రణాళిక’ను రూపొందించామన్నారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, గ్రామాల్లోని ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత ప్రభుత్వం సిబ్బంది ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారన్నారు.
ప్రతీ గ్రామంలో ఏ మేరకు ఖాళీ స్థలాలు అందుబాటులో ఉన్నాయి? ఎన్ని మొక్కలు నాటవచ్చు? ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది ఎన్ని మొక్కలు నాటవచ్చు? వాటిని బతికించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని అన్న అంశంపై ప్రణాళికలో స్పష్టంగా పేర్కొన్నారు. నర్సరీ పేరును సంబంధిత గ్రామం పేరుతోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఉదాహరణకు లింగాల అన్న గ్రామంలోని నర్సరీకి ‘తెలంగాణకు హరితహారం నర్సరీ, లింగాల’ అన్న పేరు పెట్టారు. రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా, 12,292 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటయ్యాయి. ప్రతి గ్రామంలో మొక్కల పెంపకం పనులు ప్రారంభమయ్యాయి. 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, వివిధ సంస్థలకు చెందిన సామూహిక ప్రాంతాలుగా గుర్తించిన 40,522 ఎకరాల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టి ఈ స్థలాల్లో2.26 కోట్ల మొక్కలు నాటారు. అలాగే 24,244 కిలోమీటర్ల పొడవులో గ్రామాల మధ్య అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 80.88 లక్షల మొక్కలను నాటారు. ప్రతి మొక్కను కుటుంబ సభ్యుల్లా భావించి రక్షించాలని గ్రామాల్లో అంతా కలిసి నిర్ణయించారు.
*చిత్రం... ఖాళీ స్థలంలో మొక్కలు నాటుతున్న దృశ్యం