తెలంగాణ

ఆర్టీసీ ఉద్యమానికి పవన్‌కళ్యాణ్ మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: ఆర్టీసీ కార్మికులు 19వ తేదీన నిర్వహించే తెలంగాణ బంద్‌కు మద్దతు ఇస్తున్నట్టు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు అండగా జనసేన కార్యకర్తలు నిలుస్తారని చెప్పారు. 48వేల మంది ఉద్యోగాలు తీసేస్తాననడం సబబుకాదని, అభద్రతా భావంతోనే ఉద్యోగులు చనిపోతున్నారని అన్నారు. సమస్య మరింత జఠిలం చేయకుండా చూడాలని ఆయన హితవుపలికారు. సోమవారం నాడు హైదరాబాద్ ప్రశాసన్‌నగర్ జనసేన కేంద్ర కార్యాలయంలో ఆర్టీసీ సమ్మె , తాజా పరిస్థితులపై ఆయన శంకర్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, పీ హరిప్రసాద్, తాళ్లూరి రామ్ తదితర నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ గత రెండు వారాలుగా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె తీవ్రరూపం దాల్చిందని, ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరెడ్డి అనే కార్మికుడు కుటుంబ సభ్యుల ముందే తనను తాను కాల్చుకుని చనిపోవడం, రాణీగంజ్ డిపోకు చెందిన సురేందర్‌గౌడ్ అనే కార్మికుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటనలు సమ్మె తీవ్రతను తెలియజేస్తున్నాయని అన్నారు. కార్మికులు సమ్మెకు దిగినపుడు వారి డిమాండ్లు ఎంత వరకూ ఆమోదయోగ్యమో అనే అంశాన్ని పక్కన పెట్టి వారి ఆవేదననైనా కనీసం ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని అన్నారు. ఒక్కసారిగా 48వేల మంది ఉద్యోగులను తొలగిస్తామనడం తనకు బాధ కలిగించిందని అన్నారు.