తెలంగాణ

భవిష్యత్తుకు సౌరశక్తే ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: ప్రజల విద్యుత్ అవసరాలు తీరేందుకు సోలార్ పీవీ (్ఫటోవోల్టాయిక్) సాంకేతిక పరిజ్ఞానమే మన ముందు ఉన్న ఒకే ఒక మార్గమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఐఐసీటీలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఎంఎస్‌ఎఈడీఐ, టీఎస్‌ఆర్‌ఈడీసీఓ సంయుక్తంగా ఐఐసీటీలో సోమవారం ఏర్పాటు చేసిన జాతీయస్థాయి వర్క్‌షాప్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అడ్వాన్స్‌డ్ సోలార్ పీవీ టెక్నాలజీస్ అంశంపై ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌ను లాంఛనంగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ప్రస్తుతం బొగ్గు ఆధారిత విద్యుత్ (్థర్మల్ పవర్), జలవిద్యుత్తు (హైడల్ పవర్) ఉపయోగిస్తున్నామన్నారు. బొగ్గు లభించినంత వరకే థర్మల్ పవర్‌కు ఉత్పత్తి జరుగుతుందని, అలాగే జలాశయాల్లో నీరు ఉన్నంత వరకే హైడల్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తారన్నారు. ఈ రెండింటిపై ఆధారపడటం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయని, అందుకే నిరంతరం ఉచితంగా లభించే సౌరశక్తి (సూర్యరశ్మి) ని వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే సౌరశక్తిని ఉపయోగించుకునేందుకు అమెరికా, బ్రిటన్, చైనా తదితర దేశాలతో పాటు భారతదేశం కూడా ప్రయత్నిస్తున్నాయన్నారు. పూర్తిస్థాయిలో మనకు అవసరమైన విద్యుత్ అవసరాలకోసం సోలార్‌పైనే ఆధారపడక తప్పదన్నారు. తెలంగాణ రాజ్‌భవన్‌లో కూడా సౌరశక్తిని ఉపయోగించుకుంటున్నామని తమిళిసై గుర్తు చేశారు. సౌరశక్తి వినియోగంపై పెద్దఎత్తున పరిశోధనలు జరగాల్సి ఉందని, ఈ దిశలో ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకుని, అవసరమైన నిధులను విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. సౌరశక్తి వినియోగించడంలో మరింత అడ్వాన్స్‌డ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నారు.
*చిత్రం... వెండర్ల మీట్‌లో మాట్లాడుతున్న గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్