తెలంగాణ

చర్చలకు సిద్ధం కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కార్మికుల బలిదానాలతో రోజురోజుకూ సమ్మె ఉద్ధృతం అవుతుండడంతో పరిస్థితి చేయి దాటకముందే పరిష్కరించాలని సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావును ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఆర్టీసీ కార్మికుల బలిదానాలు తనను ఎంతో కలిచివేశావని, సమ్మె విరమించి చర్చలకు సిద్ధం కావాలని ఈ మేరకు కేశవరావు సోమవారం ఉదయం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అటు ముఖ్యమంత్రిని, ఇటు ఆర్టీసీ కార్మికులను ఉద్దేశించి ఆయన ఒక లేఖను కూడా మీడియాకు విడుదల చేశారు. అయితే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అనుమతి లేకుండా ఎంతో కీలకమైన, జటిలమైన అంశంపై కేశవరావు మీడియాకు ప్రకటన విడుదల చేసే అవకాశం ఉండదు. సీఎం సూచన మేరకే కేకే ఈ ప్రకటనను
విడుదల చేసినట్టుగా పలువురు భావిస్తున్నారు. పైగా కార్మికుల డిమాండ్లలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మినహా మిగతా డిమాండ్లు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు కూడా కేకే తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మెపై స్పందించిన మంత్రులు కూడా కేశవరావు ఇచ్చిన విధంగా పిలుపు ఇవ్వలేదు. దీంతో ముఖ్యమంత్రి సూచన మేరకే కేకే ఆ ప్రకటన ఇచ్చినట్టు భావిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని తన లేఖలో కేశవరావు విజ్ఞప్తి చేయడం, కార్మిక సంఘాల నేతలు కూడా దీనిని స్వాగతించడంతో మంగళవారం చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రతినిధిగా కేశవరావుతో చర్చలు జరపడానికి తమకు అభ్యంతరం లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్ రాజిరెడ్డి స్పష్టం చేశారు. చర్చలకు తాము కూడా సిద్ధంగా ఉన్నట్టు గవర్నర్ తమిళిసైని కలిసిన సందర్భంగా కూడా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. తన విజ్ఞప్తికి కార్మిక సంఘాల నేతలు సానుకూలంగా స్పందించడంతో సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లిన కేశవరావు సాయంత్రమే తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆర్టీసీ నాయకులతో జరుగబోయే చర్చల్లో ప్రస్తావించే అంశాలపై సీఎంతో సమావేశమై కేశవరావు చర్చించినట్టు సమాచారం. దీంతో 10 రోజుల పాటు ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి ప్రజలను తీవ్ర ఇక్కట్లకు గురిచేసిన ఆందోళనలు విరమణ దిశగా మంగళవారం చర్చలు సాగే అవకాశం ఉంది. చర్చలు ఫలిస్తే మంగళవారం సాయంత్రానికల్లా కార్మికులు సమ్మె విరమించే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కార్మిక నేతలు పట్టుబడితే మాత్రం పరిష్కారం అంత త్వరగా లభించకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇలా ఉండగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం సచివాలయం నుంచి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఆర్టీసీ, రవాణా, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.