Others

ఆర్టీసీ సమ్మెపై మంత్రుల వ్యాఖ్యలు శోచనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 14: ఆర్టీసీ సమ్మెపై రాష్టమ్రంత్రులు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, మంత్రుల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోందని రాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజారవాణాలో ఆర్టీసీ కీలకమని, ఆ సంస్థ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం విస్మరించడంతో విధిలేక సమ్మెకు దిగితే ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తూ సమస్యను జటిలం చేస్తుందన్నారు. సమ్మెపై సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరించాల్సిన సీఎం కేసీఆర్ అందుకు భిన్నంగా 50 వేలమంది కార్మికులను తొలగించడం సరికాదన్నారు. సమ్మె విషయంలో కేసీఆర్ మొండివైఖరి వీడి తక్షణమే సమస్యలను పరిష్కరించాలని హితవు చెప్పారు. ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా నిరంకుశంగా వ్యవహరించడం పతనానికి నాంది అవుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులు రాజకీయ నేతలకు అమ్ముడుపోయారని మంత్రులు బాధ్యతారాహిత్యంగా ఇస్తున్న ప్రకటనల పట్ల ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. ఖమ్మం ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు పాల్పడి హైద్రాబాద్ ఆసుపత్రిలో మృతిచెందగా 3 గంటల తరువాత ప్రకటించడం దుర్మార్గం అన్నారు. హిందూ సంప్రదాయాలకు భిన్నంగా శ్రీనివాసరెడ్డి అంత్యక్రియలను రాత్రిపూటే జరిపేలా ప్రభుత్వం పోలీసుల చేత బలవంతంగా చేయించడం హేయమన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జిచేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి అత్మహత్యకేసులో సీఎం కేసీఆర్, రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌లను బాధ్యులుగా గుర్తించి వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు కాంగ్రెస్ అండగా నిలిచి పోరాడుతుందన్నారు. విలేఖరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్‌అలీ, నాయకులు వీరన్న నాయక్, కక్కిరేణి శ్రీనివాస్, చింతమళ్ల రమేష్, నాగుల వాసు, నరేందర్ నాయుడు, రాంబాబు, సాయినేత, సాజిద్‌ఖాన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు