తెలంగాణ

విత్తన భాండాగారంగా రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్: విత్తన ఉత్పత్తి రంగంలో నూతన పరిశోధనలు ఆవిష్కృతం అవుతుండగా, విత్తన భాండాగారంగా తెలంగాణను తీర్చి దిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గౌరారం సమీపంలోని కావేరి విత్తన పరిశోధన సంస్థలో మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలతో కలిసి వివిధ పరిశోధనలను ఆవిష్కృతం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు కలిగిన విత్తనాలు రూపొందించడం లక్ష్యం కాగా, జన్యుపరమైన, ప్రతికూల పరిస్థితుల్లో సైతం మొలకెత్తే విత్తన ఉత్పత్తి రైతులకు మేలు చేస్తుందని దీనిని దృష్టిలో పెట్టుకొని విత్తన పరిశోధనలకు శ్రీకారం చుడుతూ ప్రోత్సహిస్తున్నట్టు స్పష్టం చేశారు. దేశంలోనే ఉష్ణోగ్రత స్థితిగతులను తట్టుకొని విత్తనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం తెలంగాణ ప్రాంతంలో ఉండగా, మరి కొద్దినెలల్లో దేశంతో పాటు ప్రపంచ దేశాలకు విత్తనాలను ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యం కాగా, ఆ దిశగా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి కల సాకారం చేసుకోబోతున్నట్టు తెలిపారు. ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన కావేరి విత్తన పరిశోధన సంస్థ నాణ్యతా ప్రమాణాలతో కూడిన విత్తనాలను అందిస్తూ అధిక దిగుబడి సాధనలో ప్రముఖ కంపెనీల స్థాయికి ఎదిగినట్టు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం మూలాధారం కాగా, అన్నదాతలను ఆదుకునే క్రమంలో ఎంత ఖర్చునైనా భరించి ఆర్థికంగా భరించడంతో పాటు ఆత్మహత్యలు లేని తెలంగాణగా తీర్చిదిద్దుతామని వివరించారు.
ఈ కార్యక్రమంలో కావేరి విత్తన పరిశోధన సంస్థ అధినేత జివి భాస్కర్‌రావు, కార్పొరేషన్ చైర్మెన్‌లు భూపతిరెడ్డి, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... మాట్లాడుతున్న రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి