తెలంగాణ

నర్సంపేటలో డిపో కార్యదర్శి ఆత్మాహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన టీఎం యూ డిపో కార్యదర్శి బత్తిని రవి ఆదివారం సాయంత్రం ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఆర్టీసీ సమ్మె పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో మనస్థాపానికి గురి కావడం.. ఇదే సమయంలో ఖమ్మంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాస్‌రెడ్డి అనే కార్మికుడు మృతిచెందడంతో బత్తిని రవి తీవ్రంగా కలత చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో నర్సంపేటలో ఆదివారం సాయంత్రం తీవ్ర ఉద్రికత్త చోటు చేసుకుంది. నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన బత్తిని
రవి నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే సమయంలో టీఎం యూలో డిపో కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. గత తొమ్మిది రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మెలో రవి చురుగ్గా పాల్గొంటున్నాడు. ప్రతి నిత్యం సహచర కార్మికులకు ధైర్యం నూరి పోస్తూ పోరాట పటిమను ప్రదర్శిస్తూ ఉండేవాడు. కాగా ఆదివారం సీఎం ప్రకటన, కార్మికుడి మృతితో తీవ్ర మనస్థాపానికి గురైన రవి బస్టాండ్ ఆవరణలో జరుగుతున్న ఆందోళనలలో అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకునేందుకు విఫల యత్నం చేశారు. సహచర కార్మికులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో పోలీసులు రవిని చికిత్స కొసం నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.

*చిత్రం...ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ రవి