తెలంగాణ

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల నియామకాలకు నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఆర్టీసీ బస్సులు నడపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు అధికారులు పరుగులు తీస్తున్నారు. సమ్మెలో కార్మికులు పాల్గొంటున్న నేపథ్యంలో వారి స్థానంలో ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానంగా డ్రైవర్, కండక్టర్, మెకానికల్ ఉద్యోగాల్లో తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆయా పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రవాణా, పోలీస్ శాఖలో విశ్రాంత ఉద్యోగులను చేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం డ్రైవర్‌కు రోజు వేతనం రూ.1,500, కండక్టర్‌కు 1,000, టైర్ మెకానికల్, ఎలక్ట్రీషియన్‌కు 1,000 వేతనంగా నిర్ణయించారు. ఎక్కువగా యువతీ, యువకులకు అవకాశం ఇవ్వాలని సీఎం సూచించారని అధికార వర్గాలు చెబుతున్నాయి.